ఆంధ్రప్రదేశ్‌

క్షీరారామంలో మహా కుంభాభిషేకం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, అక్టోబర్ 20: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రం క్షీరారామంలో మహా కుంభాభిషేకం మహాక్రతువు గురువారం వైభవంగా ప్రారంభమయ్యింది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తొలుత 33 మంది భక్తులు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి, ఆలయ ప్రవేశం చేశారు. 11 మంది రుత్విక్కులు వీరిచే దీక్షాధారణ చేయించారు. యాగశాలలో 108 శత కలశ సహిత 1296 దేవతల ఆవాహన ప్రారంభించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, చతుష్టి యోగిని, క్షేత్రపాల, వాస్తు, నవగ్రహ, బ్రహ్మ మండపారాధనలు, సూర్య నమస్కారాలు, లఘు నీరాజన, మంత్ర పుష్ప, తీర్ధ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు ఉదయం నిర్వహించారు. మధ్యాహ్నం యాగశాలలో 12 విహారాల (1296) కలశాల ఆవాహన, శ్రీ రుద్రార్చన, చతుల్లింగంతో భద్ర మండలపారాధనతో తిరిగి పుణ్యదంపతులు ఆలయ ప్రవేశంచేశారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జి, గజల్స్ శ్రీనివాస్ నంది బ్యానర్‌ను ఆలయంలో ఊరేగింపుగా తెచ్చి పూజలో కూర్చున్న 33 మంది పుణ్యదంపుతులచే తాకించి యాగ మండపంపై ఉంచారు. బిజెపి పట్టణ అధ్యక్షుడు శిడగం పాపారావు ఆలయ సందర్శనం, మహాకుంభాభిషేక సందర్శన నిర్వహించారు. మహా కుంభాభిషేకం సందర్భంగా క్షీరారామలింగేశ్వరుడు, పార్వతి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. క్షేత్రపాలకుడు జనార్ధనస్వామి-లక్ష్మి దేవిని కూడా ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భధ్రాజీ, ధర్మకర్తలు నాళం బాబీ, కోరుకొండ సుబ్బారావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

చిత్రం..కలశ పూజ నిర్వహిస్తున్న రుత్విక్కులు