ఆంధ్రప్రదేశ్‌

జగన్‌పై బిసి వ్యతిరేక ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 27: జగన్ బిసి వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా, ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా వ్యూహం రూపొందిస్తున్నారా? ఇందు కోసం పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పటికే తగిన శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులో బిసిలకు కేటాయిస్తున్న నిధులు ఏవిధంగా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయాలన్న అంశాన్ని ప్రధానంగా చేర్చారు. బిసిలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ద్రవ్య వినిమయ బిల్లును వైకాపా వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ బిల్లును వ్యతిరేకించడం వెనుక జగన్ ఆంతర్యం వేరు. తన పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించే ప్రయత్నంలో భాగమిది. కానీ టిడిపి దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నిస్తోంది. బిల్లును వ్యతిరేకించడం ద్వారా జగన్ బిసి వ్యితిరేకి అని ప్రచారం చేయడానికి ఉపక్రమిస్తున్నట్టు భోగట్టా. మరి జగన్ దీన్ని ఏవిధంగా ఎదుర్కొంటారో కూడా వేచి చూడాలి.
‘విప్’పై అయిష్టత
ఇదిలా ఉండగా ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకించాలని విప్ జారీ చేయడం పట్ల వైకాపాలోని కొంతమంది సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వైకాపాలో కొంతమంది సీనియర్లు పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీలో చోటు సంపాదించుకోవాలనుకున్నారు. అది దక్కకపోవడంతోపాటు, ఈ విప్ జారీ వారిని కొంత బాధిస్తున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటీని ఆసరాగా తీసుకుని కొంతమంది సీనియర్లు పార్టీని వెళ్లడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.