ఆంధ్రప్రదేశ్‌

స్విమ్స్ నోటీసులపై 8 లోగా వివరణ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 22: ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను స్విమ్స్‌కు పంపించవద్దంటూ స్విమ్స్ యాజమాన్యం ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చిన హెచ్చరిక నోటీసులపై హైకోర్టు శనివారం 8వ తారీఖులోపు ఇందుకు సంబంధించి పూర్తివివరాలు అందజేయాలని రాష్టవ్రైద్య ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, స్విమ్స్ డైరెక్టర్, డి ఎం అండ్ హెచ్ ఓకు నోటీసులు జారీచేసింది. స్విమ్స్‌లో వెంటిలేటర్ల కొరత ఉన్న నేపథ్యంలో కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని స్విమ్స్‌కు పంపవద్దని ప్రైవేటు కార్పొరేటు ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు. స్విమ్స్ అధికారుల నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ రాయలసీమ పోరాటసమితి కన్వీనర్ నవీన్‌కుమార్ రెడ్డి, మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈకేసును స్వీకరించి పూర్తివివరాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. వాస్తవానికి స్విమ్స్ నోటీసులు జారీచేసిన వెంటనే ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో స్విమ్స్ డైరెక్టర్ స్పందించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని స్విమ్స్‌కు పంపించేముందు రోగికి చికిత్స చేసిన వైద్యులు స్విమ్స్ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లను సంపద్రించాలని మాత్రమే తాము చెప్పామన్నారు.