ఆంధ్రప్రదేశ్‌

తాగుబోతులు రెచ్చిపోతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 22: పాఠశాలల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పిడి యాక్టు ప్రయోగించి, జైలుకు పంపుతామని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు హెచ్చరించారు. పాఠశాలలు దేవాలయాల కంటే పవిత్రమైనవని, ఏ గ్రామంలోనైనా దేవాలయం లేకపోయినా ఫర్వాలేదు కాని, పాఠశాల తప్పనిసరిగా ఉండాలని, వాటిని పవిత్రంగా కాపాడుకోవాలని హితవు పలికారు. కాకినాడలోని ఆనందభారతి మైదానంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్రప్రదేశ్, దోమలపై దండయాత్ర కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ప్రాంగణంలో దోమ బొమ్మలతో కనిపించిన విద్యార్థులను చంద్రబాబు వేదికపైకి పిలిపించుకుని అభినందించారు. ఈ సందర్భంలో వర్మ అనే విద్యార్థిని దోమలపై దండయాత్రకు నీవు చేస్తున్న కృషిని చెప్పమని ముఖ్యమంత్రి అడిగారు. విద్యార్థి మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలంలోని పగడాలపేట గ్రామంలో తాను చదువుకుంటున్నానని, తమ పాఠశాలలో మందుబాబుల ఆగడాలతో భరించలేకపోతున్నామని ముఖ్యమంత్రికి వివరించాడు. పాఠశాల పరిసరాలు అధ్వాన్నంగా మారాయని, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని వాపోయాడు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎవరని అడిగారు. వేదికపైకి వెళ్ళిన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థి చెప్పిన విషయాలు వాస్తవమేనని అంగీకరించారు. వెంటనే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆ పాఠశాల ఏ నియోజకవర్గంలో ఉందని ప్రశ్నించగా అక్కడే ఉన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తన నియోజకవర్గమేనని చెప్పారు. దీంతో ‘ఏంటమ్మా? నువ్వేంచేస్తున్నావ్ అక్కడ? నీ నియోజకవర్గంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నావా’ అని మందలించారు. పాఠశాలల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై పిడి యాక్టు ప్రయోగించి, జైలుకు పంపాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. సభలో ఇంకా మహిళా సమాఖ్యల ప్రతినిధులు, విద్యార్థులచే స్వచ్ఛసంకల్పం, దోమలపై దండయాత్ర కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి మాట్లాడించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలను బహిరంగ మల విసర్జన రహితంగా ప్రకటించిన ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులను ప్రక్షాళన చేస్తున్నామని, ఎన్టీ ఆర్ వైద్య సేవ, సంచార వైద్యం, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వంటి ఎన్నో సేవలను అమలుచేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి 10మందిలో ఒకరికి ఏదో ఒక రూపంలో పింఛను అందిస్తున్నామన్నారు. 43 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లను ప్రతి నెలా ఒకటో తేదీకే అందజేస్తున్నామన్నారు. సమాజంలో ఆర్ధిక అసంతులనానికి కారణంగా ఉన్న నల్లధనం నిర్మూలనకు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాలని, అన్ని రకాల ఆర్థిక కార్యక్రమాలు బ్యాంకుల ద్వారానే జరిగేలా నిర్దేశించాలని కేంద్రాన్ని కోరినట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మిస్తామని, దీనితో అభివృద్ధి శరవేగంగా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. కాకినాడ-పుదుచ్ఛేరి రాష్ట్రాల మధ్య బకింగ్ హాం కెనాల్‌ను పునరుద్ధరించి, జలరవాణాకు మార్గం సుగమం చేయనున్నట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లో 2018నాటికి పూర్తిచేస్తామని, మరోవైపు సుమారు 1630కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తుందన్నారు. కెజి బేసిన్ అభివృద్ధిసాధించే అవకాశాలున్నట్టు పేర్కొన్నారు.
chitram...
పాఠశాలలో మందుబాబుల ఆగడాలపై ముఖ్యమంత్రికి సభలో ఫిర్యాదుచేసిన విద్యార్థి వర్మ