ఆంధ్రప్రదేశ్‌

కబేళాకు తరలిస్తున్న పశువులు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, అక్టోబర్ 23: అనంతపురం జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రం పొలాచిలోని కబేళాకు లారీల్లో తరలిస్తున్న పశువులను విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తాడిపత్రి సమీపంలో ఆదివారం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. లారీల్లో సుమారు 60 పశువులను కుక్కి, బయటకు కనిపించకుండా ఉండేందుకు చుట్టూ టార్‌పాల్ కప్పారు. దీంతో ఊపిరాడక కొన్ని అపస్మారకస్థితికి చేరుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం, ముదిగుప్ప, నార్పల వారపుసంతల్లో పశువులను కొనుగోలు చేసి కసాయిలు లారీల్లో వాటిని తమిళనాడులోని కబేళాకు తరలిస్తున్నారు. 9 లారీల్లో పశువులను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో విశ్వహిందూపరిషత్ కార్యకర్తలు మార్గమధ్యంలో కాపుకాశారు. తాడిపత్రి మండలం రావివెంకటాంపల్లి గ్రామం సమీపంలో రెండు లారీలు రావడంతో అనుమానం వచ్చి అడ్డుకున్నారు. టార్‌పాల్ తొలిగించి చూడగా లోపల పశువులు కనిపించాయి. ఎనుములు, ఆవులు, ఎద్దులకు మూకుతాడువేసి ఆ తాడును లారీటాపునకు కట్టివేశారు. ఒక్కో లారీలో దాదాపు 60 పశువులను కుక్కి, వాటికి కనీసం గాలీకూడా తగలకుండా చుట్టూ టార్‌పాల్ పట్టాలను బిగించడంతో ఊపిరాడక కొన్ని పశువులు అపస్మారకస్థితికి చేరుకున్నాయి.
ఈ సందర్భంగా విహెచ్‌పి పట్టణ అధ్యక్షులు నరశింహులు, నాయకులు రామాంజినేయులు మాట్లాడుతూ మూగజీవాలను అక్రమంగా తరలిస్తే సహించేదిలేదన్నారు. రూరల్ ఎస్సై నారాయణరెడ్డి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పి నాయకులు పురుషోత్తం, మహేంద్ర, సంజీవరాయుడు, ఎబివిపి నాయకులు వీరేష్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. లారీలో తరలిస్తున్న పశువులు