ఆంధ్రప్రదేశ్‌

‘స్వచ్ఛ’సాధనకు కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 23: స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించింది. ఈ జిల్లాను 2018 మార్చి 31వ తేదీ నాటికి బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా ప్రకటించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలుచేస్తున్నారు. అలాగే అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 1069 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 139 గ్రామ పంచాయతీలను బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా అక్టోబర్ 2న ప్రకటించారు. మరో 465 గ్రామాలను 2017 మార్చి 31వ తేదీ నాటికి బహిరంగ మల,మూత్ర విసర్జన లేని గ్రామాలుగా ప్రకటించనున్నారు. 2018 మార్చి నెలాఖరుకు జిల్లాలో నూరు శాతం గ్రామాలను ఒడిఎఫ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా ఈ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. గ్రామాల్లో వ్యర్థాల (చెత్త) నుండి సంపదను సృష్టించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని 78 పంచాయతీల్లో వర్మీ కంపోస్ట్ యూనిట్లను నెలకొల్పారు. అలాగే జిల్లాలోని అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డులను గుర్తించి, ఉపాధి హామీ పథకం క్రింద యార్డులను ఏర్పాటుచేయనున్నారు. జిల్లాలోని 696 పంచాయతీల్లో డంపింగ్ యార్డులు పరిపాలనామోదం పొందగా, 272 గ్రామాల్లో యార్డుల ఏర్పాటుకు సంబంధించి పనులు ప్రారంభించారు. 146 గ్రామాల్లో ఇప్పటికే పనులు పూర్తికాగా, 126 గ్రామాల్లో యార్డు పనులు ప్రగతిలో ఉన్నాయి. 26 ఘన వ్యర్ధ పదార్ధాల నిర్వహణ కేంద్రాలను జిల్లాలో ఏర్పాటుచేయగా, మరో 56 గ్రామాల్లో ఘన వ్యర్ధ పదార్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏర్పాటుచేసిన ఈ యార్డుల ద్వారా 60 మెట్రిక్ టన్నుల వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి జరిగినట్టు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ చెప్పారు. 2018 మార్చి 31వ తేదీకి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఘన వ్యర్ధ పదార్ధాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే ద్రవ వ్యర్ధ పదార్ధాల నిర్వహణ కోసం కూడా ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికై ప్రత్యేక ప్రణాళికలను అమలుచేస్తున్నారు. ఇటీవల 40మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి వంతున 10,762 మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటివరకు 9518 మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు. స్వచ్ఛ సంకల్పంలో పాఠశాలల విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ఆయా కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించారు.