ఆంధ్రప్రదేశ్‌

బూందీ పోటులో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 24: తిరుమల శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలోని అదనపు పోటులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. పోటులో బూందీ తయారుచేస్తున్న ఓ గ్యాస్ స్టవ్ నుంచి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మంటలు ఎగసిపడి గోడలకు ఉన్న నెయ్యిబూజుకు అంటుకుని క్షణకాలంలో ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. సకాలంలో స్పందించిన పోటు సిబ్బంది అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించి గ్యాస్ ఇన్ ‘లైట్’ను నిలిపి వేయడంతో భారీ ప్రమాదం తప్పింది. సంఘటన జరిగిన కొద్ది సేపటికే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. మంటలు చెలరేగిన సమయంలో శ్రీవారి ఆలయంలోని లడ్డూ తయారీ పోటుకు అనుసంధానంగా బూందీ తరలించే పైప్‌లైన్ ఉండటంతో, మంటలు వ్యాపిస్తాయని ముందు జాగ్రత్తచర్యగా అధికారులు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఆలయంలోని పోటు గోడలకు ఇతర ప్రదేశాలలో మంటలు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా అక్కడ చల్లటి నీటిని చల్లారు. బూందీపోటులో మంటలు అదుపుచేసిన అనంతరం మరమ్మతు కార్యక్రమాన్ని చేపట్టారు. గంట పాటు మరమ్మతులు చేసిన అనంతరం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బూందీ తయారీని పునఃప్రారంభించారు. ఈప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. అయితే స్వల్ప ఆస్తినష్టం వాటిల్లింది. కాగా పోటు అగ్నిప్రమాదానికి గురైన సమయంలో వెలుపలకు భారీగా పొగ రావడంతో బయట ఉన్న సిబ్బంది, భక్తులు భయంతో పరుగులు తీశారు. సాధారణంగా బూందీ తయారీ కోసం నూనె, నెయ్యి వాడుతుంటారు.