ఆంధ్రప్రదేశ్‌

మావోయిజమా? మరణ మృదంగమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 25: మావోయిజమా? మరణ మృదంగమా అన్న శీర్షికతో విశాఖపట్నం మన్యం గిరిజన సమాఖ్య రూపొందించిన ఫ్లెక్సీలు విశాఖ నగరంలో మంగళవారం ప్రధాన కూడళ్ల వద్ద కనిపించాయి. మావోయిస్ట్‌ల చర్యలను వ్యతిరేకిస్తూ వెలిసిన ఈ ఫ్లెక్సీలు నగరంలో చర్చనీయాశంమయ్యాయి. మావోయిస్ట్‌లు హతమార్చిన పాంగి రామయ్య, పాంగి శివయ్య ఉదంతాలను పేర్కొంటూ, ఎన్నాళ్లీ ఘాతుకాలకు పాల్పడతారంటూ సమాఖ్య ప్రశ్నించినట్టుంది. పోలీసు కేసులను ఎదుర్కొన్న గిరిజనులను సైతం హతమార్చడం విశ్వాస ఘాతుక చర్యగా వారు అభివర్ణించారు. నిరాయుధులుగా ఉన్న గిరిజనులను హతమార్చడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించడం గమనార్హం. ఈ ఫ్లెక్సీలను గిరిజన సమాఖ్య ఏర్పాటు చేసిందా? లేదా వేరెవరైనా ఈ పని చేశారా? అన్నది తెలియరావల్సి ఉంది.