ప్రకాశం

రోడ్డు ప్రమాదంలో నూతన వధూవరులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, మార్చి 27: కాళ్లపారాణి ఆరకముందే బంధువుల ఇంట కార్యక్రమానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తూ ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో నూతన వధూవరులు మృతి చెందిన సంఘటన ఆదివారం మార్కాపురం పట్టణానికి సమీపంలోగల రాయవరం వద్ద జరిగింది. పెద్దారవీడు మండలం సానికవరం గ్రామానికి చెందిన తోట శివ (25), తోట హేమలత (20)లకు గత నాలుగునెలల కిందట వివాహమైంది. శనివారం కొనకనమిట్ల మండలంలోని ఒద్దిమడుగు గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లి ద్విచక్రవాహనంపై ఆదివారం ఉదయం తిరుగుప్రయాణం కాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ కారుడ్రైవర్ మద్యం సేవించి ఒంగోలువైపు వెళ్తూ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శివ, హేమలతలు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న మార్కాపురం సిఐ సంఘటనా స్థలానికి వెళ్లి మృతుల వివరాలు తెలుసుకొని బంధువులకు తెలియచేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.