ఆంధ్రప్రదేశ్‌

బాక్సైట్ తవ్వకాలకు ‘బూసిపుట్టు’ బూచి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 25: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై అడుగుల ముందుకు వేసేందుకు ప్రభుత్వం మార్గాన్ని సుగమమం చేసుకుంటోందా? బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్న మావోయిస్ట్‌లను పూర్తిగా తుడిచిపెట్టే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందా? మావోయిస్ట్‌లతోపాటు మిలిషియా సభ్యులను కూడా పోలీసులు తొక్కిపెట్టేయాలని చూస్తున్నారా? బాక్సైట్‌కు వ్యతిరేకంగా భవిష్యత్‌లో ఉద్యమాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ భారీ ఎన్‌కౌంటర్‌నే బూచిగా చూపించాలని భావిస్తున్నారా? ప్రజా సంఘాల నాయకులు చేస్తున్న ఈ ఆరోపణలను కూడా పరిగణలోకి తీసుకోవలసి అవసరం ఎంతైనా ఉంది. ఏజెన్సీలోని బాక్సైట్ నిక్షేపాలను వెలికి తీయాలని ప్రభుత్వం కృత నిశ్ఛయంతో ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు కాకపోతే రేపైనా తవ్వకాలు తథ్యమని ప్రభుత్వ పెద్దలు చెపుతున్నారు. గిరిజనుల అభిప్రాయాలకు అనుగుణంగానే తవ్వకాలు జరుపుతామని ప్రభుత్వం చెపుతోంది. బాక్సైట్ తవ్వకాలను మావోయిస్ట్‌లు మొదటి నుంచి వ్యతిరేకిస్తునే ఉన్నారు. ఆంధ్ర, ఒడిశా మావోయిస్ట్‌లు దీనిపై ఉద్యమ కార్యాచరణను కూడా రూపొందించారు. ఏజెన్సీలోని ప్రజా ప్రతినిధులపై బాక్సైట్‌కు వ్యతిరేకంగా మాట్లాడాలని వత్తిడి పెంచుతున్నారు. బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ కొంతమంది ప్రజా ప్రతినిధులను మావోయిస్ట్‌లు హతమార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. గిరిజనులను అడ్డుపెట్టుకుని మావోయిస్ట్‌లు బాక్సైట్ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ముందు మావోయిస్ట్‌ల టార్గెట్ చేసి వారిని పూర్తిగా ఏఓబి నుంచి ఖాళీ చేయిస్తే, గిరిజనుల్లో భయంపుడుతుందని ప్రభుత్వం భావిసోంది. ఇందులో మొదటి టాస్క్‌ను పూర్తి చేసింది. సోమవారం నాటి ఘటనతో మావోయిస్ట్‌లు మళ్లీ తలెత్తే పరిస్థితి లేదు. సోమవారం నాటి ఘటనను బూచిగా చూపించి బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం ముందుకు కదిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి.