ఆంధ్రప్రదేశ్‌

మూస పద్ధతులకు స్వస్తి చెబుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 25: ప్రజలకు నేరుగా సేవలందించే ప్రభుత్వ శాఖలలో తక్షణం సేవా ప్రమాణాలు నెలకొల్పి దానికి అనుగుణంగా పనులు జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా ఆదాయ ఆర్జిత శాఖలుగా ఉన్న ఏడు, ఎనిమిది శాఖలలో నెల రోజుల్లో ఈ మార్పు కనిపించాలని మంగళవారం మధ్యాహ్నం సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆయా శాఖల సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలలో ఇంకా పాత మూస పద్ధతుల్ని పట్టుకు వేలాడటం ఏ మాత్రం మంచిది కాదని, సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. ఇదే ధోరణి కొనసాగితే పౌర సేవా పత్రాలను (సిటిజన్ ఛార్టర్లు) ప్రకటించి ప్రజలకే నేరుగా జవాబుదారీగా మార్చాల్సి వస్తుందని, పరిస్థితి అంతదాకా కొని తెచ్చుకోకుండానే ఆయా శాఖలలో తక్షణం సంస్కరణలకు సంసిద్ధం కావాలని సూచించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో పూర్తి స్థాయి సాంకేతిక విధానాలు అమలు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే ఇంకా డాక్యుమెంట్ రైటర్లు, దళారులకు ఫీజులిచ్చుకోవాల్సిన దుస్థితి ఉండటం సహించరానిద న్నారు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎవరికి వారే తమ ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌లో జరుపుకునేలా చూడాలని అధికారులకు చెప్పారు. మొదటి ఆరు నెలల కాలానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో వృద్ధి 12.03 శాతం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఏడాది రూ.2538.20 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికి రూ.2054.09 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో సిఆర్‌డిఎ నిబంధనల కారణంగా కొనుగోళ్లు, విక్రయాల ప్రక్రియ మందగించడం ఒక కారణమని అన్నారు. ఆదాయ ఆర్జిత శాఖల పనితీరు, ఫలితాల గురించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజెయ్ కల్లాం నివేదిక ఇచ్చారు.