ఆంధ్రప్రదేశ్‌

మృతదేహాన్ని అప్పగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, అక్టోబర్ 25: తన భర్త మృతదేహాన్ని అప్పగిస్తే తాము దహనసంస్కారాలు చేసుకుంటామని ఆంధ్ర-ఒడిశా (ఎఒబి) బోర్డర్‌లో సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు అయినపర్తి దాసు అలియాస్ మధు భార్య కమలకుమారి పోలీసులను కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్లలో నివసిస్తున్న కమలకుమారి మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు. పల్లంట్ల గ్రామానికి చెందిన మధు ఎఒబి వద్ద సోమవారం నిర్వహించిన పోలీసుల ఎన్‌కౌంటర్లో మృతిచెందినట్టు వార్తలొచ్చిన సంగతి విదితమే. తన భర్త సుమారు 25 సంవత్సరాల క్రితమే తమని విడిచి వెళ్లిపోయారని, ఇప్పటివరకూ ఆచూకీ తెలీదన్నారు. అయితే ఎన్‌కౌంటర్లో మృతిచెందినట్లు మంగళవారం ఉదయం పత్రికల ద్వారా తెలిసిందని మధు భార్య కమలకుమారి చెబుతున్నారు. తమకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారన్నారు. చిన్నకుమార్తె అశ్వినికి రెండేళ్ల వయసులో తన భర్త మావోయిస్టుల్లో కలిసిపోయారని తెలిపారు. ఇటీవలే ఒక కుమార్తెకు వివాహం కూడా అయిందన్నారు. మధు తండ్రి యాకోబ్ వయసు 95 సంవత్సరాలు. మతిస్థిమితం లేదు. ఇతనికి తన కుమారుడు మధు మృతిచెందిన విషయం కూడా తెలియదు. మధు తల్లి కమల ఇటీవలే మృతిచెందింది. వ్యవసాయ కూలీగా జీవిస్తున్న తనకు భర్త మృతదేహాన్ని పోలీసులు అప్పగించినా ఆసుపత్రి నుండి తీసుకువచ్చేందుకు ఆర్థిక స్థోమత లేదని కమలకుమారి పేర్కొన్నారు. పోలీసులు తమ గ్రామానికి తీసుకువచ్చి అప్పగిస్తే కడసారిగా చూసుకుని, అంత్యక్రియలు చేసుకుంటామని మధు భార్య కమలకుమారి కోరుతోంది.