ఆంధ్రప్రదేశ్‌

మళ్లీ ఎన్నికలకా? డబ్బెవరిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా వచ్చే ఏడాది తమ ఎంపీలు రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు వెళతారన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజా ప్రకటనపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీలో ఎవరినీ సంప్రదించకుండా జగన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై ఎంపీలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
హోదా కోసం శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఒత్తిడి చేస్తామని, అప్పటికీ కేంద్రం స్పందించకపోతే బడ్జెట్ సమావేశాల తర్వాత సామూహిక రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళతామని జగన్ తాజాగా కర్నూలు సభలో ప్రకటించారు. దీనిపై పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక సంస్ధ అయిన పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ (పీఏసీ)లో చర్చించి, నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. పార్టీ స్థాపించిన తర్వాత ఇప్పటివరకూ ఒకే ఒక్కసారి పీఏసీ కమిటీ భేటీ అయిందని, ఈ మధ్యలో తీసుకున్న అన్ని నిర్ణయాలూ జగన్ సొంతవే తప్ప పీఏసిని సంప్రదించి తీసుకున్నవి కాదని గుర్తుచేస్తున్నారు.
ఇప్పటివరకూ పీఏసీలో చర్చించకుండా జగన్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఆందోళన కార్యక్రమాలే కాబట్టి దానితో తమకు పెద్దగా ఇబ్బంది లేదని, కానీ తమ రాజకీయ భవితవ్యానికి సంబంధించిన రాజీనామాల వ్యవహారంపై మాత్రం తమతో కనీసం ఒక్కమాట కూడా చెప్పకుండా ప్రజల సమక్షంలో ఉప ఎన్నికలకు వెళతామనడం తమను రాజకీయంగా ఇరికించడమేనని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకునే ముందు అన్ని పార్టీల్లో చర్చ, ఆ తర్వాత ఫీలర్లు ఇవ్వడం ఒక సంప్రదాయమని, కానీ తమ నేత అవేమీ పాటించకుండా, తమ ప్రమేయం లేకుండా నేరుగా విధానపరమైన నిర్ణయం ప్రకటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ప్రత్యేక హోదా కేంద్రబిందువుగా రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు వెళ్లడం చూడటానికి, ప్రచారానికి బాగుంటుందని కానీ, క్షేత్రస్థాయిలో ఫలితాలు భిన్నంగా ఉంటాయంటున్నారు. హోదా ఇవ్వబోమని, దాని బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పడం, దానిని తెదేపా-బిజెపి ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం చేయటంతో జనం మూడ్ మారిందని వివరిస్తున్నారు. కేంద్ర నిర్ణయం తర్వాత జనం ఒక్కసారి కూడా వీధుల్లోకి రాకపోవటం వెనుక కారణాలను ఒక రాజకీయ పార్టీగా విశే్లషించుకోకుండా నిర్ణయం తీసుకోవడం వల్ల జగన్‌కు పోయేదేమీ లేదని, తమ రాజకీయ భవితవ్యమే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే 20 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలు తెదేపాలో చేరగా, నంద్యాల, అరకు ఎంపీలు కూడా ఆ పార్టీలో చేరారని, కర్నూలు ఎంపి బుట్టా రేణుక కూడా ముందు తెదేపా వైపు మొగ్గు చూపి, మళ్లీ వెనక్కివచ్చారని గుర్తు చేస్తున్నారు.
హోదాపై జనంలో పోరాడే మూడ్ లేకపోవడంతోపాటు, దానిని మర్చిపోతున్నారని, అలాంటి అంశాన్ని ప్రచారాయుధంగా మలిచి ఉప ఎన్నికలకు వెళ్లడం రాజకీయంగా ఆత్మహత్యా సదృశమేనంటున్నారు. ‘జనంలో హోదా వస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. కానీ దానికోసం పోరాటం చేసే సమయం వారికి లేదు. అందుకే హోదా ఉద్యమాలన్నీ పార్టీలకే పరిమితమయ్యాయి. ఈ విషయంలో జగన్ తెలంగాణ ప్రజలతో ఏపి ప్రజలను పోలుస్తున్నట్లుంది. ఇక్కడ ప్రజలకు ఉద్యమాలు చేసే సమయం, మనస్తత్వం లేదు. అందుకే అది బూమెరాంగవుతుంద’ని ఒక సీనియర్ నేత విశే్లషించారు.
వీటికంటే ఆర్థిక వనరులు ముఖ్యమైనవని గుర్తు చేస్తున్నారు. విభజనకు రెండేళ్ల ముందు నుంచీ తాము పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టామని స్థానిక సంస్థల నుంచి తమ ఎన్నికల వరకూ మంచినీళ్లలా డబ్బు ఖర్చుపెట్టామంటున్నారు. అయితే నాటి ఎన్నికలకు చేసిన అప్పుల వడ్డీ ఇప్పటికీ తీర్చలేదంటున్నారు. పైగా గత ఎన్నికల్లో జగన్ తమకు నయాపైసా సాయం చేయలేదని, ఎమ్మెల్యే అభ్యర్ధులకూ తామే సర్దుబాటు చేశామని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వస్తుందంటున్నారు.