కృష్ణ

వీధికెక్కిన టిడిపి వర్గపోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, అక్టోబర్ 26: గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మొదలైంది. బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో జరిగిన పార్టీ నియోజకవర్గ సమావేశంలో బందరు ఎంపి కొనకళ్ళ నారాయణ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి వర్గీయులు బాహాబాహీకి దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. 2000లో జరిగిన గుడివాడ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రావి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 2004 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఈ సమయంలో రావికి, ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నాని వర్గీయుల మధ్య ఘర్షణలు ఏర్పడుతుండేవి. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో రావికి టిడిపి సీటు నిరాకరించడంతోపాటు అభ్యర్థిగా కొడాలి నానిని ఎంపిక చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో టిడిపిలో వర్గపోరు కనుమరుగైంది. 2014 ఎన్నికల నాటికి కొడాలి నాని వైసీపి అభ్యర్థిగా పోటీ చేయడంతో మళ్ళీ రావి టిడిపిలో చేరి కొడాలి నానిపై పోటీ చేసినా ఓటమి తప్పలేదు. అయితే ఎన్నికల నాటికే మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి వర్గీయులు కాంగ్రెస్‌ను వీడి టిడిపిలోనే ఉన్నారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ నుండి వచ్చిన పిన్నమనేని వర్గీయులకు సముచిత ప్రాధాన్యం కల్పించక పోవడం రావి, పిన్నమనేని వర్గీయుల ఘర్షణకు కారణమైంది. కార్యకర్తల సమావేశంలో పిన్నమనేని బాబ్జి మాట్లాడుతూ తమ వర్గీయులను సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని అనడంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో రావి వివరణ ఇస్తుండగా పిన్నమనేని వర్గీయులు ఆందోళనకు దిగారు. రావి, పిన్నమనేనిల మధ్య మాటల యుద్ధం కూడా చోటు చేసుకుంది. చాలాసేపటికి ఎంపి కొనకళ్ళ ఇరువర్గాలను శాంతింపజేసి సమావేశాన్ని కొనసాగించారు.