ఆంధ్రప్రదేశ్‌

19న దళిత, గిరిజన మహాగర్జన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 29: దళిత, గిరిజన మహాగర్జన కార్యక్రమాన్ని నవంబర్ 19న రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎస్టీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శనివారం శివాజీ విలేఖరులతో మాట్లాడారు. దళిత, గిరిజనుల ఆర్ధిక, సామాజికాభివృద్ధి కోసం కమీషన్ తీసుకుంటున్న చర్యలను మహాగర్జనలో వివరించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో దళిత, గిరిజనుల సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ నిధులను గత ప్రభుత్వాలు ఇతర కార్యక్రమాలకు మళ్లించి, సంక్షేమ నిధులను దుర్వినియోగం చేశాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంటూ, ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికే ఖర్చు పెట్టేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి నిరోధక శక్తులుగా మారిన ప్రతిపక్షాలు ఈ అంశంలో చేస్తున్న విమర్శల నిగ్గు తేల్చేందుకు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఎస్సీ ఎస్టీల విదేశీ విద్యాభ్యాసానికి ఆర్ధిక సహాయాన్ని 10 లక్షల నుండి 20లక్షలకు ప్రభుత్వం పెంచిందని, కుల వివక్ష సంఘటనలలో బాధితులకు అందించే పరిహారాన్ని రెండు రెట్లు పెంచినట్టు తెలిపారు. దళిత, గిరిజన రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం క్రింద ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల కల్పనలో సమస్యలు పరిష్కరించి, సకాలంలో యూనిట్లు గ్రౌండ్ అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.