ఆంధ్రప్రదేశ్‌

ఎన్‌కౌంటర్లపై వౌనమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 29: ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్ హత్యలపై సిఎం చంద్రబాబు ఎందుకు వౌనం వహిస్తున్నారని పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ ప్రశ్నించింది. ఈ మేరకు సిఎంకు శనివారం బహిరంగ లేఖను విడుదల చేశారు. హోం మంత్రి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదని, డిజిపి సాంబశివరావు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెపుతూనే హత్యలను కొనసాగిస్తున్నారని ఆరోపించింది. సిఎం ఉద్దేశపూర్వకంగానే వౌనంగా ఉన్నారని, ఆదివాసీల మరణాలకు ఆమోదం తెలుపుతున్నారని ఈ లేఖపై సంతకాలు చేసిన సిఎల్‌సి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కో-ఆర్డినేటర్ శేషయ్య, ఎపి అధ్యక్షుడు చిట్టిబాబు, పౌర హక్కుల సంఘం జనరల్ సెక్రటరీ చిలుకా చంద్రశేఖర్ తదితరులు ఆరోపించారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గాలింపు పేరుతో జరుగుతున్న మారణకాండను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.