ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్‌ ఆస్తులు జప్తు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 29: దేశం మొత్తంగా వివిధ రాష్ట్రాల్లోని అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో అగ్రి గోల్డ్ ఖాతాదారులు, ఏజంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన అఖిలపక్ష సమావేశం శనివారం నిర్వహించారు. అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఉన్నతాధికారుల బృందానికి పోలీసు, రెవెన్యూ, అకౌంట్స్‌పై అధికారాలిచ్చి అగ్రి గోల్డ్ ఆస్తుల జప్తు దగ్గర నుండి వేలం, రిజిస్ట్రేషన్ ఇతర ప్రక్రియలను నిర్వహించడంతో పాటు బాధితులకు పరిహారాన్ని అందించే బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అగ్రి గోల్డ్ ఏజెంట్లు, ఖాతాదారుల సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. యాజమాన్యానికి సంబంధించిన 67 కంపెనీల డైరెక్టర్లను క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని, వ్యక్తిగత ఆస్తులతో పాటు కంపెనీ ఆస్తులను జప్తు చేయాలని కోరారు. 1996లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నేరాల నియంత్రణకు రూపొందించిన చట్టం ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. అగ్రి గోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రి గోల్డ్ సంస్థ చేసిన ఆర్థిక మోసాల వల్ల రాష్టవ్య్రాప్తంగా ఇప్పటి వరకు 98 మంది ఏజెంట్లు, ఖాతాదారులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే 19.43 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారని, 39 వేల కోట్ల డిపాజిట్లు చెల్లించి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం స్వాధీనపరచుకున్న ఆస్తులను తక్షణమే విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హాయ్‌లాండ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా యాజమాన్యమే పెత్తనం చలాయిస్తోందని ధ్వజమెత్తారు. బిజెపి రాష్ట్ర కార్యదర్శి సురేష్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అగ్రి గోల్డ్ బాధితులకు బిజెపి అండగా ఉంటోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ అగ్రి గోల్డ్ కేసును సిఐడికి కాకుండా సిబిఐకి అప్పగించి విచారణ జరపాలని అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చలపతిరావు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న జయప్రకాష్ నారాయణ్