ఆంధ్రప్రదేశ్‌

మరో ముగ్గురు మావోల మృతదేహాల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, అక్టోబర్ 29: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల్లో మరికొందరి పేర్లను పోలీసులు నిర్ధారించారు. ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టులు మృతి చెందగా శనివారం నాటికి 20 మంది మృత దేహాలను గుర్తించారు. మరో 10 మందిని గుర్తించాల్సి ఉంది. విశాఖ జిల్లా పెదబయలు మండలం వింజరి పంచాయతీ నానాబారి గ్రామానికి చెందిన పాంగి జ్యోతి, జికెవీధి మండలం గాలికొండ పంచాయతీ మెట్టగూడ గ్రామానికి చెందిన శే్వతగా గుర్తించారు. వీరి బంధువులు ఎవరూ రాకపోవడంతో మృతదేహాలు నేటికీ పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయి. జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన గెమ్మిల దాలియా అలియాస్ రాందాస్ మృతదేహాన్ని తండ్రి మల్లేశ్వరరావుకు శనివారం మల్కన్‌గిరి జిల్లా పోలీసులు అప్పగించారు. రాందాస్ మావోయిస్టు పార్టీలో నాలుగేళ్ళ క్రితం చేరాడు. ఆర్‌ఎంపి డాక్టర్‌గా మావోయిస్టు పార్టీలో వైద్య సేవలందిస్తున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. మరో 10 మంది మృత దేహాలను గుర్తించాల్సి ఉందని మల్కన్‌గిరి జిల్లా పోలీసులు తెలిపారు.