ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయ దూరవిద్యను నిరసిస్తూ రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి,మార్చి 28: వ్యవసాయ విద్యలో దూరవిద్యను ప్రవేశపెట్టడంతో ప్రైవేటు కళాశాలల ఏర్పాటుచేయాలని పాలకులు తీసుకున్న నిర్ణయం విద్యార్థులలో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు నిరసన దీక్షకు దిగారు. ఇందులో భాగంగానే తిరుపతిలోని శ్రీ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వరా వ్యవసాయ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన దీక్షకు దిగారు. వ్యవసాయ డిగ్రీలో దూరవిద్యను తేకండి - అసలైన విద్యార్థుల ఆశయాలను చంపేయకండి అంటూ నినాదాలు చేశారు.ప్రైవేటు వ్యవసాయ కళాశాలలు రద్దుచేయాలంటూ నినాదాలు చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ వ్యవసాయ విద్యలో ప్రైవేటు కళాశాలల ఏర్పాటును, దూర విద్యను ఎట్టిపరిస్థితిల్లోనూ అనుమతించకూడదంటూ నినదించారు. నిర్ణయం మార్చుకోకపోతే మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు, నిరసన దీక్షకు దిగాలని నిర్ణయించామన్నారు.

రేపు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ స్నాతకోత్సవం
విజయవాడ, మార్చి 28: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 18, 19వ స్నాతకోత్సవం ఈ నెల 30న ఉదయం స్థానిక ఎ కనె్వన్షన్ సెంటర్‌లో జరగనుంది. విశ్వవిద్యాలయ కులపతి, రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అధ్యక్షతన జరిగే ఈ వేడుకల్లో దేశంలో తొలిసారిగా నెఫ్రాలజీ విభాగాన్ని ప్రారంభించిన చండీగఢ్‌లోని పిజిఐ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కెఎస్ ఛుగ్‌ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన వివరాలను వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు సోమవారం సాయంత్రం విలేఖర్లకు వివరించారు. ఈ వేడుకల్లో రికార్డు స్థాయిలో 4వేల 337 మంది వైద్య పట్ట్భద్రులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా 57 మందికి పట్టాలు అందిస్తారు. 13 మందికి పిహెచ్‌డి పట్టాలు, 12 మందికి సూపర్ స్పెషాలిటీ డిగ్రీలు, 32 మంది ఎండి, ఎంఎస్, పిజి డిప్లొమా హోల్డర్లకు పట్టాలు అందిస్తారు. వేర్వేరు రంగాల్లో ప్రతిభాపాటవాలు చూపిన 97 మందికి గోల్డ్‌మెడల్స్, 46 మందికి సిల్వర్ మెడల్స్, 42 మందికి నగదు బహుమతులు అందించనున్నారు. రాష్ట్ర వైద్యవిద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని డా. రవిరాజు వివరించారు. విలేఖరుల సమావేశంలో వర్సిటీ రిజిస్ట్రార్ జి అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.

30న మున్సిపల్ కార్మికుల చలో విజయవాడ
విజయవాడ, మార్చి 28: రాష్ట్రంలో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసే ప్రభుత్వ కుట్రను భగ్నం చేసి పాలకుల మెడలు వంచే దిశగా రాష్ట్రంలోని అన్ని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల నుంచి వేలాది మంది కార్మికులతో ఈ నెల 30న ‘చలో విజయవాడ’ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎఐటియుసి అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు తెలిపారు. ఎఐటియుసి, సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు సోమవారం నాడిక్కడ సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా దాదాపు 45వేల మంది మున్సిపల్ కార్మికులను తొలగించేందుకు ప్రభుత్వం జీవో నెం.279ను తీసుకొచ్చి మరోవైపు ఎవరినీ తొలగించబోము, వేతనాలు తగ్గించబోమంటూ అసత్యాలతో కార్మికులను దగా చేస్తోందని రంగనాయకులు ఆరోపించారు. దీనికి కార్మిక సంఘంగా చెప్పుకునే టిఎన్‌టియుసి వంత పాడటం సిగ్గుచేటన్నారు. ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసి ప్రస్తుతం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నారని ఆందోళన వ్యక్తపర్చారు.

ఈ-సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
అనంతపురం సిటీ, మార్చి 28: జెఎన్‌టియూ అనంతపురం విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఏపి ఈ-సెట్ 2016కు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 6వ తేదీ వరకూ గడువును పొడిగించిననట్లు ఏపి ఈ-సెట్ 2016 కన్వీనర్ ఆచార్య పిఆర్ భానుమూర్తి తెలిపారు. జెఎన్‌టియూ అనంతపురంలోని ఈ-సెట్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఏపి ఈ-సెట్ గడువును ఏప్రిల్ 6వ తేదీ వరకూ ఎటువంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చునని, రూ. 1000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 16వ తేదీ వరకూ, రూ. 5వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 23వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.