ఆంధ్రప్రదేశ్‌

జన చైతన్య యాత్రలకు మూడంచెల భద్రత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 31: నెల రోజులపాటు టిడిపి నిర్వహించే జన చైతన్య యాత్రల నేపథ్యంలో మంత్రులకు మూడంచెల భద్రత కల్పించాలని రాష్ట్ర హోంశాఖ వౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా మావో ప్రభావిత ప్రాంతాలైన ఇచ్ఛాపురం, బారువ, సోంపేట, నందిగాం, మెళియాపుట్టి, టెక్కలి, కొత్తూరు, భామిని, సీతంపేట, హిరమండలం మండలాల్లో ఈ మూడెంచల భద్రతా ఏర్పాట్లు చేసేందుకు జిల్లా పోలీసుశాఖ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. 10 నుంచి 20 కిలోమీటట్ల దూరంలో మంత్రులకు పోలీసులు రక్షణ కవచంలా ఉంటారు. అటవీ ప్రాంతంలో ఎక్కడిక్కడే ప్రత్యేక కేంద్ర బలగాలు నిత్యం కూంబింగ్, మందుపాత్రలు పసిగట్టే ప్రత్యేక టీంలు పనిచేస్తాయి. ఇదంతా తూర్పు కనుముల్లోని ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు చెందిన తొమ్మిది జిల్లాల పరిధిలో విస్తరించిన ఎఒబి జోన్‌కు వర్తించేలా పోలీసులు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తారు. జన చైతన్య యాత్రలు నవంబర్ 1 నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావల్సివుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు ఆనుకుని ఉన్న ఒడిశాలో గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్ జిల్లాలతోపాటు ఇటీవల భారీ ఎన్‌కౌంటర్ జరిగిన మల్కన్‌గిరి అటవీప్రాంతాలు మావోలకు ఆయువుపట్టు. ఈ ప్రాంతాలను జోన్లగా విడగొట్టి కార్యకలాపాలు సాగిస్తున్న మావోలకు శ్రీకాకుళం జిల్లాలో తువ్వాకొండలు, మహేంద్రగిరులు సేఫ్టీ జోన్లు. ఇక్కడి నుంచే ఎఒబి అంతటికీ ప్లీనరీ సమాచారం ఇచ్చే అవకాశం ఉంటోంది. అటువంటి ప్రాంతాల్లో మందస, వజ్రపుకొత్తూరు, టెక్కలి, మెళియాపుట్టి ప్రాంతాల్లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన చైతన్య యాత్రల్లో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఇంటెలిజెన్స్‌శాఖ హెచ్చరించింది.

డిజిపి సమీక్ష

విజయవాడ, అక్టోబర్ 31: రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే జనచైతన్య యాత్రలు, 3న ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్ పిలుపుతో రాష్టవ్య్రాప్తంగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈనేపథ్యంలో డిజిపి నండూరి సాంబశివరావు సోమవారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలు, ఇతర భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీలతో ఆయన సమీక్షించారు. ప్రధానంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యంగా భద్రతా వ్యవస్థను నూతన పద్ధతులతో పటిష్ఠపర్చాలన్నారు. ముఖ్యమంత్రికి కల్పించే భద్రతతో పాటు జిల్లాల్లో సర్పంచ్ నుంచి మంత్రి స్థాయి వరకు చేపట్టవలసిన రక్షణ చర్యలను డిజిపి సమీక్షించారు.

రబీలో ఒక్క ఎకరా
ఎండకూడదు

విజయవాడ, అక్టోబర్ 31: రబీలో ఒక్క ఎకరం పంట కూడా ఎండకుండా కాపాడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి జలవనరులు, వ్యవసాయం, పంచాయతీరాజ్, సెర్ఫ్, గ్రామీణాభివృద్ధి అధికారులతో ఆయన సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు కాలువల ద్వారా నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు. సాగునీటి సరఫరాలో జలవనరులు, వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అందుబాటులో ఉన్న ఉపరితల, భూగర్భ జలాలు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా దాదాపు 155 టిఎంసిల భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని, సాగునీటి అవసరాలు తీర్చాలన్నారు అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సకాలంలో తడులు అందించాలని ఆదేశించారు.