ఆంధ్రప్రదేశ్‌

పటేల్‌ను ఏనాడూ విస్మరించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 31: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరి వాడని, అయితే బిజెపి ఆ మహానేత పేరును స్వప్రయోజనాలకు వాడుకుంటోందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు. ఇక్కడి ఎపిపిసిసి భవన్‌లో సోమవారం రాత్రి జరిగిన దివంగత ప్రధాని ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పటేల్‌ను కాంగ్రెస్ పార్టీ ఏనాడూ విస్మరించలేదన్నారు. అలాంటి మహానుభావులను కాంగ్రెస్ పార్టీ మర్చిపోలేదు, మర్చిపోబోదన్నారు. పటేల్ బతికున్న సమయంలోనూ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదనే ప్రచారం సరికాదని దిగ్విజయ్ సింగ్ ఖండించారు. పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ఇందిరా గాంధీ పేరును విస్మరించే ప్రయత్నం చేస్తున్నారంటూ చంద్రబాబు తీరును విమర్శించారు. గ్రామం నుంచి పట్టణ స్థాయి వరకు ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాలు జరుపనున్నామని, ఇందుకు ఏఐసిసిఐ, రాష్ట్ర కమిటీలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపిచ్చారు. రాష్ట్రానికి ఇందిరా గాంధీ చేసిన మేలును ప్రజకు తెలియపరుస్తామని పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు, ఏఐసిసి ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, పలువురు మాజీ మంత్రులు పాల్గొన్నారు.

విజయవాడలో సోమవారం మాట్లాడుతున్న దిగ్విజయ్ సింగ్