ఆంధ్రప్రదేశ్‌

కల్తీ నెయ్యి తయారీ స్థావరంపై పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, నవంబర్ 3: జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ నెయ్యి తయారుచేసే స్థావరంపై టు టౌన్ పోలీసులు గురువారం రాత్రి దాడులు చేసి నిర్వాహకుడితోపాటు 50 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు టు టౌన్ సిఐ వెంకటప్ప కథనం మేరకు అనంతపురం జిల్లాకు చెందిన మురళి కొంత కాలంగా చిత్తూరు నగరంలోని జెండామాను వీధిలో నవ్యా బ్రాండ్ పేరుతో నెయ్యి తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసి విక్రయాలు నిర్వహిస్తున్నాడు. డాల్డా, పామోలిన్ ఆయిల్‌ను నెయ్యిలో కల్తీచేసి, నవ్యా బ్రాండ్ పేరుతో ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి స్వచ్ఛమైన నెయ్యిగా మార్కెట్‌లోకి విడుదలచేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇక్కడ కల్తీ నెయ్యి తయారుచేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఈ స్థావరంపై దాడులు నిర్వహించారు.