ఆంధ్రప్రదేశ్‌

యాత్రల జాతర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 3 : అధికార తెలుగుదేశం పార్టీ ఆర్భాటంగా ప్రారంభించిన జన చైతన్యయాత్రలు జాతర మాదిరిగా మారిపోయాయి. మరోసారి అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల సన్మానాలు, సత్కారాలతో ఈ యాత్రలు ముగుస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేసే ఈ యాత్రల అసలు లక్ష్యం మాత్రం దూరంగానే మిగిలిపోయింది. మొత్తం మీద ప్రహసనప్రాయంగా ఈ జాతర ముందుకు సాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఈ యాత్రలు దాదాపుగా అధికార పార్టీ హంగు, ఆర్భాటాలు ప్రదర్శించడానికి మాత్రమే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఎక్కడైనా విమర్శల హడావిడిగానీ, ప్రశ్నించే ప్రయత్నం గానీ జరిగితే అణచివేత చర్యలు తెరపైకి వస్తున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లాలో ఉండి నియోజకవర్గంలో ఈ విధంగానే జన చైతన్యయాత్ర జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యేను ప్రశ్నించారన్న కారణంతో ఒక వ్యక్తిని పోలీసులు నిర్బంధించడం తీవ్ర విమర్శలకు కారణమైంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ వ్యక్తి పట్ల పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చివరకు స్థానికులు కూడా దీన్ని వ్యతిరేకించి ఆందోళనకు దిగే స్థితికి దారితీసింది. దాదాపుగా ఇదే విధమైన రీతిలో మరికొన్ని నియోజకవర్గాల్లోనూ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన చోట్ల కేవలం ప్రహసనప్రాయంగాను, ఆయా ప్రజాప్రతినిధుల హడావిడి చూపించుకునేందుకు మాత్రమే అన్నట్లుగా ఈ యాత్రలు తయారయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక శాతం యాత్రల సందర్భంగా ఏర్పాటుచేసే కార్యక్రమాలు విజయోత్సవ సభల మాదిరిగానే సాగుతుండటం గమనార్హం. అంతేకాకుండా ఒక రకంగా ఎన్నికల వాతావరణాన్ని కూడా దాదాపుగా తలపిస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు సాగుతుండటం మరో విశేషం. ఈ సందర్భంగా కార్యక్రమాల వివరణ కన్నా ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి చంద్రబాబుల భజన కార్యక్రమాలు మాదిరిగానే ఇవన్నీ సాగుతున్నాయని చెప్పవచ్చు. దీనికి తోడు ఇలాంటి కార్యక్రమాల సందర్భంగా అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేయడం సర్వసాధారణం. అయితే ఈ యాత్రల సందర్భంగా ఇలాంటి ప్రయత్నాలు కూడా ఎక్కడా కనపడకపోవడం విడ్డూరంగానే కనిపిస్తోంది. అయితే పార్టీ పరమైన కార్యక్రమం కావడం వల్లే ఇలాంటి ప్రయత్నాలు లేకపోయి వుండవచ్చునని చెబుతున్నప్పటికీ సామాన్య జనం నుంచి కూడా వ్యతిరేకత ఎదురైన సందర్భాల్లో అధికార పార్టీ నుంచి వస్తున్న స్పందన విమర్శలకు కారణమవుతోంది. ఇక ఒకటి, రెండు చోట్ల మాత్రం యాత్రల సందర్బంగా ప్రభుత్వ కార్యక్రమాలపై చైతన్యం తీసుకువచ్చేందుకు కొద్దిపాటి ప్రయత్నం జరుగుతుందనే చెప్పాలి.