ఆంధ్రప్రదేశ్‌

పెట్రోల్ డీలర్ల ఆందోళన ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 3: రాష్టవ్య్రాప్తంగా పెట్రో, డీజిల్ బంకుల నిర్వాహకుల ఆందోళన తీవ్రరూపం దాల్చుతోంది. ఏపిలో 2700 వరకు బంకులు ఉన్నాయి. నిత్యం కోట్లాది లీటర్ల క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు, ఖర్చులకు అనుగుణంగా తమ కమీషన్ చార్జీలు పెంచాలని డీలర్లు దీర్ఘకాలికంగా డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో గతంలో ప్రభుత్వం అపూర్వచంద్ర కమిటీని నియమించింది. కమిటీ దేశవ్యాప్తంగా వివిధ బంకులలో ఆధ్యయనం నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. డీలర్ల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలను విశదీకరించింది. ప్రస్తుతం 2.5 శాతం వరకు అమ్మకాలపై డీలర్లకు కమిషన్ అందుతోంది. ఆయిల్ దిగుమతి సందర్భంగా ఎవాపరేషన్ లాసెస్ (ఆవిరి నష్టాలు) రెండు శాతానికి పైగా ఉంటాయని డీలర్లు చెప్తున్నారు. ఈ నష్టాన్ని భరిస్తే తమకు మిగిలే కమిషన్ తక్కువేనని వాదిస్తున్నారు. బంకులలో కార్మికులు, ఉద్యోగులకు ప్రతి ఆర్నెల్లకు వేతనాలు పెంచాల్సి వస్తోందని, డిపాజిట్లు పెరుగుతున్నాయని, కలెక్షన్ చార్జిలు పోగా తమకు నామమాత్రపు ఆదాయం కూడా రావటంలేదని డీలర్లు వాపోతున్నారు. సమస్యలపై దశలవారీ ఆందోళన నిర్వహిస్తున్నారు.