ఆంధ్రప్రదేశ్‌

కాన్వాయ్ లేకుండానే ముఖ్యమంత్రి ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 3: ఎఒబి ఎన్‌కౌంటర్.. బంద్‌కు మావోల పిలుపు.. హిట్‌లిస్టులో బాబు.. లోకేష్.. ఈ పరిస్థితుల్లో కాన్వాయ్ లేకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించటం అధికార వర్గాలను విస్మయానికి గురిచేసింది. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి రాజధానిలో అయినవోలు, శాఖమూరు గ్రామాల మధ్య ఏర్పాటు కానున్న విట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఉదయం 10.30 గంటలకు హెలీకాప్టర్‌లో చేరుకోవాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో షెడ్యూల్ మారింది.. నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని సందర్శించాలని బాబు వెంకయ్యను కోరారు. దీంతో షెడ్యూల్ మారింది. అప్పటికప్పుడు నిర్ణయించిన కార్యక్రమం కావడంతో ఇద్దరూ ఉండవల్లిలోని సిఎం నివాసం నుంచి లోకేష్ కారులో వెలగపూడికి బయల్దేరారు. సిఎం కాన్వాయి అప్పటికే శంకుస్థాపన ప్రాంతం వద్దకు చేరుకుంది. దీంతో అధికారులు ఉరుకులు, పరుగులు తీశారు. సచివాలయంలో సదుపాయాలు, ఉద్యోగుల సాధకబాధకాలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆరాతీశారు. సొంత రాష్ట్రంలో పనిచేయటం తమకు ఆనందంగా ఉందని సచివాలయ ఉద్యోగుల సంఘంనేత మురళీకృష్ణ తెలిపారు. ఈసందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే సచివాలయ భవనాలను నిర్మించి పాలనా యంత్రాంగాన్ని తరలించటంలో చంద్రబాబు కృషి ప్రశంసనీయమని కొనియాడారు.