ఆంధ్రప్రదేశ్‌

పాపం.. జగన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 3: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాజధాని నగరంలో పార్టీ ఆఫీసు, ఇంటికి భూమి దొరక్కుండా పోయింది. ఆ పార్టీ నేతలు కొద్దికాలం నుంచి పార్టీ ఆఫీసు, జగన్ ఇంటి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. అధికార పార్టీకి భయపడి వైసీపీకి స్థలం ఇవ్వాలంటేనే భయపడుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. అన్ని పార్టీలూ తమ కార్యాలయాలను విజయవాడకు తరలించిన నేపథ్యంలో వైసీపీ కూడా తన కార్యాలయాన్ని రాజధానికి మార్చాలని చాలాకాలం నుంచి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ముందుగా గుంటూరు సమీపంలోని రెడ్డిపాలెంలో స్థలం కోసం అనే్వషించారు. స్థలం, అన్నీ బాగున్నా అది రాజధానికి దూరం కావడంతో పాటు భద్రతా కోణంలో సురక్షితం కాకపోవడంతో జగన్ దానిపై విముఖత చూపారు. విజయవాడపైనా జగన్ విముఖత చూపడంలో సామాజిక కోణం కూడా ఉందంటున్నారు. అందుకే ఆయన విజయవాడలో రాత్రి బస చేసేందుకు ఇష్టపడటం లేదు. ‘ఆయన తెదేపా యువనేత దూకుడును చూసి భయపడుతున్నారు. అందుకే బెజవాడకు రావాలంటే ఇష్టపడటం లేదు. వచ్చినా కార్యక్రమం అయిపోయిన వెంటనే హైదరాబాద్ వెళుతున్నారు. ఇక్కడ ఒక సామాజిక వర్గం పెత్తనం ఎక్కువని, వారి నుంచి తనకు హాని ఉందని భావిస్తున్నట్లుంద’ని వైసీపీ అగ్రనేత ఒకరు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం వెళ్లినా బస విషయంలో ముందు ప్రకటించిన దానికి భిన్నంగా మరో ప్రాంతాన్ని జగన్ ఎంచుకుంటున్నారు. ప్రభుత్వ భద్రతపై నమ్మకం లేని జగన్, సొంతంగా 150 మంది బౌన్సర్లను నియమించుకున్నారు. తన భద్రతపై అంత జాగ్రత్తగా ఉండే జగన్, విజయవాడ కంటే గుంటూరులోనే ఉండాలని కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వెలగపూడిలోనే సచివాలయం, అసెంబ్లీ నిర్మిస్తున్నందున అక్కడికి సమీపంలో స్థలం తీసుకుంటే బాగుంటుందని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. దాంతో కొద్దికాలం నుంచి నేతలు ఆ ప్రాంతంలో స్థలం కోసం అనే్వషణ ప్రారంభించారు. అయినా వారి అనే్వషణ ఫలించలేదు.
మంగళగిరి సమీపంలో స్థలాలు ఉన్నప్పటికీ జగన్‌కు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదంటున్నారు. జగన్‌కు స్థలం ఇస్తే అధికార పార్టీ నుంచి ఎక్కడ ఇబ్బందులొస్తాయననే భయంతో చాలామంది వెనుకంజ వేస్తున్నారు. జగన్‌కు సన్నిహితుడైన బాలాజీరెడ్డి తన స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే వెలగపూడికి సమీపంలో అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చిన జగన్, అక్కడ సమీపంలోనే చూడాలని పురమాయించారు. ఈ క్రమంలో ఇటీవలే వైసీపీలో చేరిన సినీనటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఉండవల్లికి సమీపంలోని తన స్థలంలో తాత్కాలిక పార్టీ ఆఫీసు నిర్మించి ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.