ఆంధ్రప్రదేశ్‌

త్రుటిలో తప్పిన ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు/ జి.మాడుగుల, నవంబర్ 3: విశాఖ మన్యంలో బుధవారం రాత్రి మరో ఎన్‌కౌంటర్ త్రుటిలో తప్పింది. ఎఒబిలో గత నెల 24న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మావోయిస్టులు గురువారం ఐదు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో మన్యంలో బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ మావోయిస్టులు ఏజెన్సీలోని పలుచోట్ల కరపత్రాలు వెదజల్లుతూ వాల్‌పోస్టర్లను అతికిస్తున్నారు. జి.మాడుగుల మండలం గుదలవీధి నుంచి బొయితిలి, మద్దిగరువు గ్రామాల వరకు బుధవారం రాత్రి మావోయిస్టులు వాల్‌పోస్టర్లను అతికించారు. అయితే మావోల బంద్‌ను విఫలం చేయాలని పోలీస్ యంత్రాంగం ఏజెన్సీలో భారీగా పోలీసు బలగాలను మోహరించి విస్తృతంగా కూంబింగ్ చేపట్టింది. జి.మాడుగుల మండలంలో మావోయిస్టులు వాల్‌పోస్టర్లను అతికించే సమయంలో అక్కడికి దగ్గరలోనే పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నారు. గుదలవీధి గ్రామం నుంచి వరుసగా అన్ని గ్రామాలలో మావోయిస్టులు వాల్‌పోస్టర్లను అతికించి ముందుకు సాగుతుండగా పోలీసులు మావోలు అతికించిన వాల్‌పోస్టర్లను తొలగించే పనిలో పడ్డారు. మావోల వాల్‌పోస్టర్లను తొలగించే పనిలో పోలీసులు నిమగ్నం కాకుంటే మావోయిస్టులు సునాయసంగా పోలీసుల చేతికి చిక్కేవారని చెబుతున్నారు.