ఆంధ్రప్రదేశ్‌

ఊరూరా కార్తీక వన సమారాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 3: కార్తీక వన సమారాధన కార్యక్రమాలు భారీగా నిర్వహించాలని, ప్రకృతితో మనిషి అనుసంధానమయ్యే సమయం ఇదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో గురువారం ఆయన అటవీ శాఖ కార్యక్రమాలను సమీక్షించారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 19న జరిగే కార్తీక వన సమారాధనలో తాను పాల్గొంటానని తెలిపారు.
హరితాంధ్ర మిషన్‌లో విద్యార్థులను భాగస్వాములుగా చేయాలని, ప్రతి శనివారం ర్యాలీలు జరిపి వనం - మనం కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు. వనం పిలుస్తోంది ప్రచారంతో చైతన్యం కలిగించాలన్నారు. అటవీ శాఖ సమర్పించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూస్తూ పలు సూచనలిచ్చారు. ఆకాశహర్మ్యాలతో కాంక్రీట్ జంగిల్స్‌గా మారిన నగరాల్లో నగర వనాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో నగర వనాలను ఏర్పాటు చేయాలన్నారు. నగర వనాల్లో 2.5 నుంచి 6 కి.మీల వరకు సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఔషధ విలువలున్న మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. యోగాభ్యాసం చేసేందుకు, కేఫెటేరియా లాంటి సౌకర్యలు కల్పించాలన్నారు. నవంబర్ నాటికి రాజమహేంద్రవరంలోని దివాన్ చెరువు, కాకినాడ దగ్గర కోరింగ, గుంటూరు జిల్లా నల్లపాడు, కర్నూలు జిల్లా గార్గేయపురం వనాలు సిద్ధమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డిసెంబర్ నాటికి తిరుపతి దివ్యారామం, చిత్తూరు, కడప, జనవరికల్లా విజయవాడ దగ్గర కొత్తూరు, విశాఖపట్నం సమీపాన కంబాలకొండ, నెల్లూరుల్లో నగర వనాలు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని తెలిపారు.

చిత్రం.. అటవీ శాఖ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమీక్ష