ఆంధ్రప్రదేశ్‌

రూ.5లక్షలు లంచంతో దొరికిపోయన డిఎఫ్‌ఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 3: జిల్లాలోని పార్వతీపురం మండలం బడిదేవరకొండకు సమీపంలో ఉన్న ఎంఎస్‌పి గ్రానైట్స్‌కు అటవీశాఖ అనుమతుల కోసం డిఎఫ్‌ఒ ఎ.రమణమూర్తి, క్వారీ యజమాని పలనివేలు నుంచి రూ.5లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబికి పట్టుబడ్డాడు. గురువారం సాయంత్రం పట్టణంలోని ఎస్‌విఎన్ నగర్‌లో డిఎఫ్‌ఒ ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా ఎసిబి సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ యూనిట్‌కు చెందిన డిఎస్పీ రమాదేవి రెడ్‌హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మండలంలోని బడిదేవరకొండకు సమీపంలో కోరి గ్రామంలో కలర్ గ్రానైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఎంఎస్‌పి గ్రానైట్‌కు అనుమతులు మంజూరు చేసింది. అయితే ఇది రిజర్వు ఫారెస్టులో ఉందని టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కలెక్టర్ వివేక్ యాదవ్ రీ-సర్వేకు ఆదేశించారు. రీ-సర్వేలో అది రిజర్వు ఫారెస్టులో లేదని అనుమతులు ఇవ్వడానికి డిఎఫ్‌ఒ రూ.25 లక్షలు డిమాండ్ చేసినట్టు బోగట్టా. చివరకు క్వారీ యజమాని నుంచి రూ.20 లక్షలు ఇస్తే అనుమతి పత్రాలు ఇస్తామని చెప్పడంతో క్వారీ యజమాని పలనివేలు నుంచి అడ్వాన్స్‌గా ఈ రోజు రూ.5లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇదిలా ఉండగా డిఎఫ్‌ఒ రమణమూర్తి ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఎసిబి అధికారులు పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, లాకర్లలో ఏ మేరకు మొత్తం ఉన్నదీ సోదా చేస్తున్నామని ఎసిబి డిఎస్పీ రమాదేవి తెలిపారు. ఈ దాడిలో నలుగురు సిఐలు, ఎస్సైలు, ఐదుగురు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

చిత్రం.. డిఎఫ్‌ఓ రమణమూర్తి ఇంట్లో ఏసిబి అధికారుల తనిఖీలు