ఆంధ్రప్రదేశ్‌

ఏఒబిలో బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం/విజయనగరం , నవంబర్ 3: ఎఒబి సరిహద్దులో మావోయిస్టులు గురువారం నిర్వహించిన బంద్ ప్రభావం స్పష్టంగా కనబడింది. మల్కన్‌గిరిలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మావోయిస్టులు ఐదు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎఒబిలో ‘కోబ్రా’ ఆపరేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో గురువారం కోబ్రా 202 బెటాలియన్ రాయగడ జిల్లాలో హత్‌మునిగుడ ఏజెన్సీలో రెండు లాండ్ మైన్లు గుర్తించింది. సుమారు 24 ప్రత్యేక దళాలతోపాటు జిల్లా పోలీస్, వలంటరీ ఫోర్స్‌లు మావోల బంద్ ప్రభావితం లేకుండా పనిచేసాయి. ఇందులో బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్, ఐఆర్‌బి బెటాలియన్‌లు ఎఒబిని జల్లెడ పట్టాయి. గుర్తించిన లాండ్‌మైన్లను సాంకేతిక పరిజ్ఞానంతో తొలగించారు. అయితే ఎఒబి సరిహద్దు కందమల జిల్లాలో మావోలు రహదారులను స్తంభింపజేసారు. భారీ వృక్షాలను నరికి రోడ్డుపై వేయడంతో మునిగుడ, పొల్ల, బొందువా, నారాయంపట్నం, సుంకి ప్రాంతాలకు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. వీటిని తొలగించేందుకు బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్ ప్రయత్నం చేస్తుండగానే, అక్కడకు మరికొన్ని కిలోమీటర్ల దూరంలో చెట్లను నరికి మావోయిస్టులు పడేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సివచ్చింది.
రాయగడ, కొరాపుట్, రల్లిగడ్డ, పెట్రా ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ధ్వంసం చేయడంతో ప్రత్యేక బలగాలు మరింత అప్రమత్తం అయినట్టు భోగట్టా. శ్రీకాకుళం నుంచి ఒడిశాకు బస్సు సర్వీసులు ఆర్టీసీ నిలిపివేసింది. ఏజెన్సీలోని ఆయా మండల కేంద్రాల్లో దుకాణాలు తెరుచుకోలేదు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి దుకాణాలను తెరవాలని వ్యాపారస్తులకు సూచించినప్పటికీ, గిరిజన గూడల్లో వ్యాపార, వాణిజ్య పరమైన లావాదేవీలు మూతపడ్డాయి. ఇదిలా ఉండగా ఒడిశాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మావోలు రైలును ధ్వంసం చేసారన్న పుకార్లు ఊపందుకున్నాయి. ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లా కంటాబంజి వద్ద గూడ్స్ రైలు గురువారం పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం - రాయపూర్ మధ్య తిరిగే రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ - జోథ్‌పూర్ భగత్‌కికోటి ఎక్స్‌ప్రెస్ రైలును రాయగడలో నిలిపివేసారు. అలాగే విశాఖ - నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్ రైలును పార్వతీపురంలో నిలిపివేసారు. కాగా విజయనగరం జిల్లా నుంచి ఒడిశాకు వెళ్లే అంతర్రాష్ట బస్సు సర్వీసులను ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా నిలిపివేశారు.
మిశ్రమ స్పందన
పాడేరు, జి.మాడుగుల,: బెజ్జంగి అటవీ ప్రాంతంలో గత నెల 24న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మావోయిస్టులు తలపెట్టిన బంద్‌కు విశాఖ మన్యంలో గురువారం మిశ్రమ స్పందన లభించింది. ఏజెన్సీలోని కొన్ని మండలాల్లో మావోల బంద్ విజయవంతం కాగా మరికొన్ని మండలాల్లో పాక్షికంగా ముగిసింది. అయితే ఏజెన్సీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోని వ్యాపారులు స్వచ్చంధంగా దుకాణాలను మూసివేసి బంద్‌కు సహకరించారు. మావోయిస్టుల బంద్‌ను భగ్నం చేసేందుకు పోలీసులు వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వ్యాపారులు పోలీసుల హెచ్చరికలను భేఖాతరు చేసినట్టు తెలుస్తోంది.
ఏజెన్సీకి ఆర్టీసీ బస్సుల నిలిపివేత
రాజమహేంద్రవరం: ఆంధ్రా-ఒడిసా బోర్డర్ (ఎఒబి)లో ఎన్‌కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు గురువారం తలపెట్టిన బంద్ ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వాణిజ్య సంస్థలు యథావిథిగా పనిచేశాయి. అయితే ఇటీవలి భారీ ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో పోలీసులు చేసిన ముందస్తు హెచ్చరికలతో రెండు జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలకు నడిచే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. దీనితో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గతంలో అనేక సార్లు మావోయిస్టులు బంద్‌కు పిలుపు ఇచ్చినా ఆర్టీసీ బస్సులు యథావిథిగా నడిచేవి. అదే విధంగా ఈసారి కూడా బస్సులు యథావిథిధిగా తిరుగుతాయని భావించిన ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

చిత్రాలు..మారేడుమిల్లి మండలంలో కల్వర్టులు తనిఖీచేస్తున్న సాయుధ బలగాలు * మన్యంలో మావోయిస్టులు నరికేసి రోడ్డుకు అడ్డంగా పడేసిన చెట్లను తొలగిస్తున్న దృశ్యం