ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ బస్సు ఢీకొని టెన్త్ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, మార్చి 28: గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడి వంతెన వద్ద సోమవారం ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఎఎస్‌ఐ డి ప్రసాదరావు కథనం ప్రకారం.. అంగలకుదురు గ్రామానికి చెందిన బి బహదూర్ మూడో కుమారుడు దిలీప్(16) ఈ నెల 21నుండి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు బైకును తానే నడుపుకుంటూ జాగర్లమూడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి వెళ్లి పరీక్షలు రాసి వస్తున్నాడు. సోమవారం ఇంగ్లీషు-2 పరీక్ష రాసి తిరిగి మోటారు బైకుపై స్వగ్రామం బయలుదేరాడు. మార్గంమధ్యలో గుంటూరు చానల్ వద్ద రోడ్డు మలుపు తిరుగుతున్న సమయంలో తెనాలి నుండి గుంటూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో దిలీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. 108 సిబ్బంది వచ్చి చూసేటప్పటికే విగతజీవిగా మారాడు. రూరల్ ఎఎస్‌ఐ ప్రసాదరావు తన సిబ్బందితో వెంటనే అక్కడికి చేరుకున్నారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తెనాలి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ప్రసాదరావు వివరించారు. దిలీప్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. దిలీప్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు మృతదేహం వద్ద భోరున విలపించారు.

ఆఫ్ఘనిస్తాన్-మణిపూర్ విద్యార్థుల ఘర్షణ
ఆరుగురికి గాయాలు
పూతలపట్టు, మార్చి 28: చిత్తూరు జిల్లా పుత్తూరు మండల పరిధిలోని ఆర్వీఎస్ నగర్‌లో ఓప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్‌లో సోమవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్- మణిపూర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఆరుగురు గాయపడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణతో హాస్టల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతున్న ఆఫ్ఘనిస్తాన్-మణిపూర్‌కు చెందిన విద్యార్థులు జిమ్ రూంలో గొడవ పడ్డారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులను మణిపూర్ విద్యార్థులు చితకబాదారు. ఈ విషయం తెలిసి కాలేజీలో చదువుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు మూకుమ్మడిగా మణిపూర్ విద్యార్థులపై దాడికి ఉపక్రమించారు. ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ వాతావణం నెలకొనడంతో స్థానిక విద్యార్థులు వీరిని అడ్డుకున్నారు. విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పాకాల సిఐ చల్లనిదొర అదనపు బలగాలతో హాస్టల్‌కు చేరుకుని ఇరువర్గాలకు చెందిన పదిమంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం హాస్టల్‌తోపాటు కాలేజీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.