ఆంధ్రప్రదేశ్‌

టెండర్లు సిద్ధం..నిధులే సమస్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 4: గోదావరి నదిపై నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం స్ఫూర్తితో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తామని చెబుతున్న పాలకులు నిధుల మాటెలావున్నా, ప్రస్తుతం ఫైళ్లను మాత్రం పరుగెట్టిస్తున్నారు. శరవేగంగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేయడానికి రంగం సిద్ధంచేశారు. ముఖ్యమంత్రితో భూమి పూజ చేయించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి నిధుల విషయంలో స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం. గోదావరి నదిపై తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామం వద్ద ఎత్తిపోతల పథకానికి జల వనరుల శాఖ నవంబర్ ఒకటో తేదీన టెండర్లు పిలిచింది. ప్రధానంగా ఈ పథకాన్ని ఏలేరు అనుసంధానానికి, విశాఖ అవసరాలకు నిర్దేశించారు. రూ.1645 కోట్ల అంచనా వ్యయంతో జల వనరుల శాఖ పాలనా ఆమోదం ఇచ్చినట్టు గోదావరి బేసిన్ చీఫ్ ఇంజనీర్ హరిబాబు చెప్పారు. ఈ పథకాన్ని ఏడాదిలోపు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నవంబర్ 7వ తేదీ నుంచి టెండర్లు స్వీకరిస్తారు. 21లోపు టెండర్లు దాఖలు చేసుకోవాల్సి వుంటుంది. టెండరు షెడ్యూళ్లు అప్‌లోడ్ చేసిన తర్వాత 14రోజులు గడువు విధించారు. నవంబర్ 20న టెక్నికల్ బిడ్ తెరిసేందుకు అవకాశం వుంది. 25న ఫైనాన్స్ బిడ్ తెరవొచ్చు. పురుషోత్తపట్నం నిర్మాణ లక్ష్యం బాగానేవున్నప్పటికీ, భారీగా అవసరమైన నిధులు ఎక్కడినుండి తీసుకువస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణా డెల్టాకు అనుసంధానం చేయడానికి పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే అది డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్)లో లేదని పోలవరం అథారిటీ నిధులు ఇవ్వడానికి మొండి చేయి చూపింది. ఇప్పటి వరకు రాష్ట్రం ఖర్చుచేసిన నిధులను తిరిగివ్వడానికి కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పుడు పట్టిసీమ స్ఫూర్తితో పురుషోత్తపట్నం పూర్తిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ స్ఫూర్తి నిధులు సాధించడంలోనా, పూర్తి చేయడంలోనా అనేది స్పష్టం కావడంలేదు. పోలవరం నిధులకే నాబార్డు ద్వారా నిధులు కేటాయించే విధంగా కేంద్రం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లోవున్న నేపథ్యంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు ఎక్కడ నుంచి నిధులు తెస్తారో అర్ధం కావడం లేదు.