ఆంధ్రప్రదేశ్‌

భక్తులకు అందుబాటులో లక్ష ఆర్జిత సేవాటిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 4: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి 2017 జనవరి 1నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా శుక్రవారం ఉదయం 11 గంటలకు 1,00,147 ఆర్జిత సేవా టిక్కెట్లను ఇంటర్నెట్‌లో భక్తులకు అందుబాటులో ఉంచామని టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ ఇ ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైందవ ధార్మిక ప్రచారం విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా జరుగుతున్న అనేక కార్యక్రమాలను వివరించారు. ఇందులో భాగంగానే ఈనెల 8నుంచి 12 వరకు ముంబయిలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 18నుంచి 20 వరకు అమెరికాలోని న్యూజర్సీలోనూ, 25 నుంచి 27 వరకు టెక్సాస్‌లోని ప్రిస్‌కో వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జె ఇ ఓ శ్రీనివాస రాజు మాట్లాడుతూ 1,00,147 లక్షల ఆర్జిత సేవా టిక్కెట్లలో స్వామివారికి తెల్లవారుజామున జరిగే సుప్రభాతసేవలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా 9,073 వేల టిక్కెట్లను ఇంటర్నెట్‌లో ఉంచామన్నారు. తోమాల 190, అర్చన 190, సోమవారం నిర్వహించే వారాంతపు సేవైన విశేష పూజ 3,200 వేల టిక్కెట్లను, మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన కు సంబంధించి 160, శుక్రవారం అభిషేకం అనంతరం భక్తులకు కల్పించే దర్శనంలో ఒకటైన నిజపాద సేవా టిక్కెట్లు 2,604 , ఆలయంలో నిత్యం జరిగే కల్యాణోత్సవాలు 20,500, ఊంజల్‌సేవ 5,300, బ్రహ్మోత్సవం 11,395, వసంతోత్సవం 22,360, సహస్రదీపాలంకరణ 25,175 టిక్కెట్లను అందుబాటులో ఉంచామన్నారు. ఇదిలావుండగా టిటిడి ఆధ్వర్యంలో ఈనెల 11నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని 12వేల దేవాలయాల్లో జరుగనున్న 8వ విడత మనగుడి ఉత్సవానికి సంబంధించిన కంకణాలు, అక్షింతలు, తదితర సామగ్రిని శుక్రవారం స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జె ఇ ఓ శ్రీనివాసరాజు, తిరుపతి జె ఇ ఓ పోలాభాస్కర్ తదితరులు ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయంలో మనగుడి సామగ్రికి పూజలుచేశారు. అక్కడనుంచి పూజా సామగ్రిని తలపై ఉంచుకొని మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయ మహద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి చేరుకున్నారు. అనంతరం పూజాసామగ్రిని ఆలయ ప్రధానార్చకులు స్వామివారిపాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.