ఆంధ్రప్రదేశ్‌

బాబుకు అసాధారణ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 4: మావోయిస్టుల ఆత్మాహుతి దాడుల హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అసాధారణ భద్రత కల్పించారు. శనివారం కర్నూలులో సిఎం పాల్గొనే పాదయాత్రకు పోలీసులు అసాధారణ భద్రత కల్పించనున్నారు. చంద్రబాబు పాదయాత్ర నగరంలోని కిడ్స్ వరల్డ్ నుంచి పాతబస్తీ వరకూ సుమారు 3 కిలోమీటర్ల మేర సాగనుంది. అనంతరం కోల్స్ కళాశాల మైదానంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్యయాత్ర సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో రెండు డ్రోన్ కెమెరాలు, సుమారు 150 సిసి కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించనున్నారు. కంట్రోల్ రూంలో ఇద్దరు డీఎస్పీలను నియమించి అనుక్షణం తగిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేసేలా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు పాదయాత్ర నిర్వహించే రహదారులతో పాటు అటు ఇటూ సుమారు అర కిలోమీటర్ పరిధిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే పోలీసు జాగిలాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాంబు నిర్వీర్యం చేసే నిపుణులు రహదారుల వెంట పర్యటించి తనిఖీలు చేపట్టారు. రాయలసీమ ప్రాంత ఐజి శ్రీ్ధర్ స్వయంగా భద్రతను పర్యవేక్షిస్తూ అవసరమైన సమచారాన్ని రాష్ట్ర డిజిపి కార్యాలయానికి పంపుతున్నారు. చంద్రబాబు రక్షణ కోసం సుమారు 600 మంది పోలీసులు, 150 మందితో కూడిన సాయుధ రక్షక సభ్యులు భద్రతలో పాల్గొంటున్నారు. సిఎం జన చైతన్యయాత్రలోనే కాకుండా ప్రభుత్వ కార్యక్రమమైన పొదుపు సంఘాల మహిళలకు రెండవ విడత పెట్టుబడి నిధి పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటుండటంతో రెండు సభలకు హాజరయ్యే ప్రజలను పూర్తిస్థాయిలో పరిశీలించి అనుమతించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. చంద్రబాబును, ఆయన కుమారుడిని హతమారుస్తామంటూ మావోయిస్టులు చేసిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు.