ఆంధ్రప్రదేశ్‌

బాబు నాకు పాత మిత్రుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు చాలా పాత స్నేహితుడని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. గవర్నర్ 71వ ఏట అడుగిడిన సందర్భంగా జరిగిన జన్మదినోత్సవంలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్‌ను కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. అతి పెద్ద కేక్ తీసుకువచ్చిన చంద్రబాబు గవర్నర్‌తో కట్ చేయించి స్వయంగా తినిపించారు. అనంతరం గవర్నర్ తన సతీమణి విమలకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ తాను గవర్నర్ కాకముందే చంద్రబాబుతో పరిచయం ఉందని వ్యాఖ్యానించారు. ఇరు రాష్ట్రాలు సరైన సమన్వయం, భాగస్వామ్యం, సహకారంతో పనిచేస్తున్నాయని, ఇది అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులను ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించారు. ప్రధానంగా అమరావతిలో విద్యాహబ్ ఏర్పాటు, విట్‌కు శంకుస్థాపన, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు అంశాలను చంద్రబాబు గవర్నర్‌కు వివరించారు. హైదరాబాద్‌లోని సచివాలయం ఖాళీ చేసే అంశంతో పాటు పలు ఇతర విషయాలను గవర్నర్ ప్రస్తావించినట్టు సమాచారం.
బండారు దత్తాత్రేయ అభినందనలు
సాయంత్రం బండారు దత్తాత్రేయ గవర్నర్ నరసింహన్‌ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సామరస్యానికి కృషి చేస్తున్న గవర్నర్‌ను దత్తాత్రేయ అభినందించారు.

చిత్రం...
జన్మదినం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు కేక్ తినిపిస్తున్న సీఎం చంద్రబాబు