బిజినెస్

ఏపికి ఉజ్వల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: సులువుగా వాణిజ్యం చేసేందుకు అనువైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం లభించడంపట్ల ఫిక్కీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఎం ప్రభాకర్‌రావు హర్షం శుక్రవారం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్ ఈ జాబితాను రూపొందించగా, పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ (డిఐపిపి) దీన్ని ఇటీవల విడుదల చేసినది తెలిసిందే. గత ఏడాదిన్నర కాలంలో ఆంధ్రలో పరిశ్రమల స్థాపనకు 11,000 ప్రతిపాదనలు వచ్చాయన్నారు. 4.5 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే 357 ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించేందుకు కసరత్తు చేస్తోందన్నారు. పన్ను సంస్కరణలు బాగా అమలవుతున్నాయని, రాష్ట్రంలో మానవ వనరులు అపారమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందని కొనియాడారు. కాగా, జాబితాలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ కూడా అగ్ర స్థానంలో నిలిచింది. జాబితా నేపథ్యంలో విదేశాల్లో పర్యటించి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని తెలుగ రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
హైదరాబాద్ ఉత్తమ స్టార్టప్ సంస్థగా
సుగర్ మ్యాథ్స్ ఎంపిక
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 4: హైదరాబాద్‌లోని స్టార్టప్ సంస్థ సుగర్ మ్యాథ్స్‌ను ఉత్తమ టెక్నాలజీ స్టార్టప్‌గా ఎంపిక చేసినట్లు టిఐఇ ఐఎస్‌బి కనెక్ట్ 2016 ప్రకటించింది. అడ్వాన్స్‌డ్ మెంటల్ మ్యాథ్స్, గేమిఫికేషన్ విభాగాల్లో అత్యంత ఆధునిక విధానాలను అమలు చేసినందుకు ఈ అవార్డు లభించినట్లు సుగర్ మ్యాథ్స్ సంస్థ వ్యవస్థాపకుడు నీరజ్ జెవల్కర్ శుక్రవారం తెలిపారు. న్యూరోసైన్స్ మెళకువలు, సైకాలజీ, సృజనాత్మకత ప్రాతిపదికన తాము అడ్వాన్స్ మెంటల్ మ్యాథ్స్‌ను రూపొందించామని ఆయన చెప్పారు.