ఆంధ్రప్రదేశ్‌

బీచ్ లవ్‌పై బిజెపి వౌనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 4: భారతీయ సంస్కృతిపై స్వదేశీ నేతల ప్రోత్సాహంతో రాష్ట్రంలో జరుగుతున్న విదేశీ దాడిని ఎదుర్కోవడంలో బిజెపి విఫలమవుతోందా? కేవలం అధికార భాగస్వామ్య మొహమాటంతో విదేశీ విష సంస్కృతికి వౌనంగా అంగీకారం ప్రకటిస్తోందా? విశాఖలో జరగనున్న బీచ్ లవ్ ఫెస్టివల్‌ను అడ్డుకోవడంలో విఫలమయిన తమ పార్టీ నాయకత్వంపై కమలదళాల అసంతృప్తి ఇది.
ఫిబ్రవరి 12 నుంచి మూడు రోజుల పాటు విశాఖ బీచ్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో జరగనున్న బీచ్ లవ్ ఫెస్టివల్‌పై మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో హిందూ సంప్రదాయం, సంస్కృతికి ప్రతినిధిగా ప్రచారంలో ఉన్న తమ పార్టీ మాత్రం వౌనం వహించడాన్ని బిజెపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. గతంలో ఈ ఫెస్టివల్ గోవాలో జరిగినప్పుడు బిజెపి సహా, సంఘ్ పరివార్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. లవర్స్‌డే రోజు పార్కుల్లో కనిపించే ప్రేమజంటలకు పెళ్లిళ్లు చేయడం ద్వారా ఆ సంస్కృతిని వ్యతిరేకిస్తుంటే, తాము అధికారం పంచుకుంటున్న రాష్ట్రంలోనే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నా తమ నాయకత్వం వౌనంగా ఉండటంపై నేతల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రాతినిధ్యం వహిస్తోన్న విశాఖపట్నంలోనే ఇలాంటి ఉత్సవాలు జరగడం వింతగా ఉందంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ షకీరాతోపాటు, వివిధ దేశాల నుంచి 9 వేల మంది విదేశీ జంటలు విశాఖలో జరగనున్న లవ్ బీచ్ ఫెస్టివల్‌కు తరలిరానున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై ఇప్పటికే మహిళా సంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా రంగంలోకి దిగింది. బికినీ ఫెస్టివల్‌పై అధికార తెదేపాను తూర్పారపట్టిన వైసీపీ, బిజెపి వౌనాన్ని కూడా ప్రశ్నించటం ఆ పార్టీ వాదులను ఇరుకునపెట్టినట్టయింది.
అయినా ఇప్పటివరకూ తమ పార్టీ అధ్యక్షుడు హరిబాబు నుంచి ఈ ఉత్సవాలపై స్పందన రాకపోవడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. భారతీయ సంస్కృతిని రోడ్డుపాలు చేసే ఈ ఉత్సవాలకు అనుమతి ఇవ్వడాన్ని బిజెపి ఎమ్మెల్యే, పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు వ్యతిరేకించారు. దీనిపై ఆయన ఇప్పటికే సీఎంకు తన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే, విశాఖకు ప్రాతినిధ్యం వహిస్తోన్న అధ్యక్షుడు హరిబాబు నుంచి మాత్రం ఎలాంటి నిరసన, స్పందన లేకపోవడంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
రాజకీయంగా తెదేపాతో కలసి అధికారం పంచుకుంటున్నప్పటికీ, ఇలాంటి సంప్రదాయ వ్యతిరేక కార్యక్రమాలను వ్యతిరేకించడానికి మొహమాట పడాల్సిన అవసరం లేదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తే ఎక్కడ మిత్రపక్షానికి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న ధోరణి తమ పార్టీ నేతలు కొందరిలో కనిపిస్తోందంటున్నారు. దీనిని వ్యతిరేకించి అడ్డుకోకపోతే తాము వాదించే హిందూ వాదంలో అర్థం, చిత్తశుద్ధి లేదన్న విషయం ప్రజలకు తెలిసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా, తాము వ్యతిరేకించాల్సిన ఇలాంటి కార్యక్రమాలను, తమ వౌనం కారణంగా వైసీపీ రంగంలోకి దిగి సద్వినియోగం చేసుకుంటోందని వాపోతున్నారు. వైసీపీ కూడా సంస్కృతి గురించి ఆందోళన చేస్తే ఇక తమకెక్కడ చోటు ఉంటుందని ఓ నేత వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు రానున్న విశాఖ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
కాగా, విశాఖ ప్రేమోత్సవ్‌కు రాష్ట్ర ప్రభుత్వమే అనుమతినివ్వడంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆగ్రహంతో ఉంది. ఈ విషయంలో బిజెపి రాష్ట్ర నాయకత్వం రాజకీయ కారణాలతో మొహమాటంతో వ్యవహరిస్తోందని గ్రహించిన సంఘ్, తన పరివారాన్ని ఆందోళనకు సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. ఏబివిపి, విహెచ్‌పిని రంగంలోకి దింపాలని నిర్ణయించింది.
ఇప్పటికే కృష్ణా పుష్కరాలకు ముందు గుళ్లను కూల్చి, మళ్లీ నిర్మిస్తామని చెప్పి మోసం చేసిన సర్కారుపై ఆగ్రహంతో ఉన్న సంఘ్, విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్‌ను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిసింది.