ఆంధ్రప్రదేశ్‌

పోయిన చోటే వెతుకుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 5 : తన ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల తన పాలనపై ప్రజాభిప్రాయాన్ని సర్వేల ద్వారా సేకరించిన ఆయన ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై స్పష్టతకు వచ్చినట్లు అర్థమవుతోంది. కర్నూలులో శనివారం పాల్గొన్న రెండు సభల్లో ఆయన ప్రసంగం తీరు ‘పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నం’ సామెతకు అద్దం పడుతోంది. రాష్ట్ర ప్రజల్లో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులు, రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందని సర్వేల ద్వారా తేలిందన్న ప్రచారం సాగుతున్న విషయం విదితమే. దీంతో ఆయా వర్గాల్లో ఉన్న వ్యతిరేకత స్థాయిని తగ్గించుకునే ప్రయత్నంలో వారి కోసం తాము చేస్తున్న కృషి, చేయబోయే కార్యక్రమాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు 32శాతం ఫిట్‌మెంట్, ఇతర సదుపాయాలు కల్పించిన విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు. విభజన అశాస్ర్తియంగా జరిగిందన్న విషయం తెలిసిన వారు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం అమరావతిలో వారికి కల్పిస్తున్న సౌకర్యాలు అందరికీ తెలిసిందే అన్నారు. ఇవే కాదు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వ చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. పొదుపు మహిళలకు రుణమాఫీ విషయంలో విడతల వారీగా హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలయ్యే వరకూ శ్రమిస్తానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో డెయిరీ ఫాంల ఏర్పాటులో మహిళలకు 50 శాతం సబ్సిడీ ఇవ్వడమే కాకుండా కేటాయింపులో తొలి ప్రాధాన్యత కూడా వారికేనని ఉద్ఘాటించారు. కట్టెల పొయ్యితో ఇబ్బంది పడుతున్న ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ మంజూరు చేస్తానని, జూన్ 2వ తేదీ నాటికి వంద శాతం గ్యాస్ కనెక్షన్ల మంజూరు పూర్తవుతుందని వెల్లడించారు. ఇక నిరుద్యోగులకు ఇస్తానన్న భృతి దుర్వినియోగం కాకూడదనే ఉద్యోగార్థులకు వారిలో ఉన్న శక్తికి మరింత పదునుబెట్టి మంచి సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు ఖర్చు చేస్తున్నామని వివరించారు. అంతేగాకుండా 20వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైందని, ఏపిపిఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాలకు అభ్యర్థుల వయో పరిమితిని 42 సంవత్సరాలకు పెంచామని సిఎం తెలిపారు. రైతులకు రుణమాఫీ అమలుపై కూడా ఆయన లెక్కలు తెలిపి ఆర్థిక పరిస్థితి బాగా లేనందునే విడతల వారీగా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. గతంలో ప్రకటించిన 2014-15వ సంవత్సరానికి ఇన్‌పుట్ సబ్సిడీని త్వరలో విడుదల చేస్తానని ప్రకటించారు. తమ ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకుని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్భ్రావృద్ధికి తాను చేస్తున్న కృషి మరో రెండేళ్లలో ఫలితాలను ఇస్తుందని, ఆ తరువాత ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. అదే జరిగితే ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రెట్టింపు లబ్ధి చేకూరుస్తానని తెలిపారు. ప్రసంగం తీరు ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను తొలగించుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోందని విశే్లషకులు భావిస్తున్నారు.
chitram...
కర్నూలులోని కోల్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యకర్తల
విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు