తెలంగాణ

విదేశీ మద్యం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 5: పార్శిల్ లారీల్లో విదేశీ మద్యాన్ని తరలిస్తుండగా చెక్‌పోస్టు అధికారులు అనుమానంతో తనిఖీచేసి దాన్ని స్వాధీనంచేసుకున్న సంఘటన ఆంధ్రా,తమిళనాడు సరిహద్దు తడ చెక్‌పోస్టులో శనివారం వెలుగుచూసింది. క్రాంతి పార్శిల్ లారీ మాటున విదేశీ మద్యాన్ని కూడా ట్రాన్స్‌పోర్టు లారీలు తరలిస్తున్నాయి. ప్రతిరోజు ఈ తంతు జరుగుతోంది. అధికారులు సంబంధిత లారీలను పట్టుకున్నప్పటికీ అపరాధ రుసుం చెల్లించి లారీలను తీసుకెళ్తున్నారు. ఇదంతా గత కొంతకాలంగా అధికారుల కళ్లుగప్పి జరుగుతోంది. పట్టుబడిన లారీలో ఏముందని అధికారులు పరిశీలించడంతో ఇది బయటపడింది. ఈ నెల 3న చెన్నై నుంచి క్రాంతి ట్రాన్స్‌పోర్ట్ లారీ వివిధ రకాల వస్తువులతో తెలంగాణ వెళ్తోంది. బివిపాలెం చెక్‌పోస్టులో అధికారులు లారీకి సరైన అనుమతి పత్రాలు లేకపోవడంతో పట్టుకొని 4వ తేదీన నోటీసులు అందజేశారు. తీరా లారీలో ఏముందని అధికారులు పరిశీలించగా చైనా బొమ్మలతో పాటు 40 విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించారు.