రాష్ట్రీయం

11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యాదినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: భారతదేశ తొలి విద్యాశాఖా మంత్రి వౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రప్రభుత్వం యుజిసిని ఆదేశించింది. ఆ మేరకు విద్యాసంస్థలకు యుజిసి కార్యదర్శి జస్పాల్ ఎస్ సాంథు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వరుసగా పలు కార్యక్రమాలను , చర్చాగోష్టి, సమావేశాలు, సదస్సులు, వ్యాసరచన పోటీలు, వక్తృత్వపోటీలు, మంచి నినాదాలు రాసిన ప్లకార్డులతో ర్యాలీలు నిర్వహించాలని యుజిసి పేర్కొంది. కేవలం ఈ కార్యక్రమాలు యూనివర్శిటీలకే పరిమితం కాకుండా దానికి అనుబంధంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లోనూ నిర్వహించేలా చూడాలని పేర్కొంది.