ఆంధ్రప్రదేశ్‌

హైకోర్టు తీర్పుపై సర్కారే స్పందిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 5: న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం వుందని, హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వమే స్పందిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కారెం శివాజీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన శనివారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
హైకోర్టు కారెం శివాజీ నియామకం చెల్లదని మాత్రమే తీర్పు ఇచ్చిందని, ఈ పదవికి కారెం అనర్హుడని చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. తీర్పు ప్రతులు ప్రభుత్వానికి అందిన తర్వాత తదుపరి చర్యలు ప్రభుత్వమే చేపడుతుందన్నారు. వైసిపి అధినేత జగన్ తన ఎస్సీ సామాజికవర్గంలోని కొంత మందిని పురిగొల్పి కోర్టులో కేసులు పెట్టిస్తున్నారని, ఇది జగన్ కుట్ర అని శివాజీ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో జగన్‌కు ఎస్సీ, ఎస్టీలు తగిన గుణపాఠం చెప్పనున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తనకు పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో తన నియామకంపై ప్రకటించారన్నారు. టెక్నికల్‌గా కొన్ని ప్రొసీజర్స్ జరగకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని, ఇదే విషయాన్ని కోర్టు కూడా ప్రస్తావించిందన్నారు.
ఈ నెల 19న రాజమహేంద్రవరంలో జరగనున్న దళిత, గిరిజన మహా గర్జన బహిరంగ సభ యథాతథంగా జరగనుందని శివాజీ వెల్లడించారు. ఈ సభలో చంద్రబాబును ఘనంగా దళిత, గిరిజనులంతా సత్కరిస్తారన్నారు. సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.