ఆంధ్రప్రదేశ్‌

వచ్చే ఏడాది విద్యుత్ వాతలు తప్పవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు వాతలు పెట్టేందుకు రాష్ట్ర డిస్కాంలు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపిఇఆర్‌సి)కి వార్షిక రెవెన్యూ నివేదికలను తయారు చేసేందుకు డిస్కాంలు, ఏపి ట్రాన్స్‌కో కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్రంలో రెవెన్యూకు, ఖర్చుకు మధ్య లోటు దాదాపు రూ.7500 నుంచి రూ 8 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ లోటును పూడ్చేందుకు ఐదు నుంచి తొమ్మిది శాతంమేర విద్యుత్ చార్జీలను పెంచేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఏఆర్‌ఆర్‌ను రూపొందించాలని డిస్కాంలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీని ప్రకారం ఐదు శాతం మేర విద్యుత్ చార్జీలను పెంచితే రూ.1000 కోట్లు, 9 శాతం పెంచాలనుకుంటే రూ.1800 కోట్ల మేర చార్జీలను పెంచేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలపై ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, ఆమోదం పొందిన తర్వాత ఏపిఇఆర్‌సికి సమర్పిస్తారు. వ్యవసాయ సబ్సిడీకి ఏ మేర రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదలచేస్తుందనే విషయాన్ని కూడా డిస్కాంలు ముందుగా ప్రభుత్వంనుంచి తెలుసుకుంటాయి. ఏపిఇఆర్‌సి బహిరంగ విచారణ నిర్వహించి వచ్చే ఏడాది మార్చి 31లోగా చార్జీల పెంపుదలపై నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.
2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2015-16 సంవత్సరంలో రూ.1261 కోట్ల చార్జీలను పెంచారు. 2016-17 సంవత్సరానికి రూ.783 కోట్లను పెంచాలని ఏపిఇఆర్‌సిని కోరితే, రూ. 216 కోట్ల మేర విద్యుత్ చార్జీలకు అనుమతించారు.
డిస్కాంలను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్ స్కీంలో రాష్ట్రప్రభుత్వం చేరింది. దీనిప్రకారం రాష్ట్రప్రభుత్వం డిస్కాంల నష్టాలను భరించాలి. దీనివల్ల రాష్ట్ర బడ్జెట్‌లో ఏర్పడే లోటును రెవెన్యూలోటుగా కేంద్రం పరిగణించదు. పైగా దీర్ఘకాలం పాటు బాండ్లను విడుదల చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. దీంతో రాష్ట్రప్రభుత్వం ఇటీవల రూ.7500 కోట్ల విలువ చేసే బాండ్లను విడుదల చేసింది. కేంద్రం కల్పించిన ఈ సదుపాయం వల్ల డిస్కాంలకు నష్ట్భారం తగ్గినా, విద్యుత్ చార్జీలను అనివార్యంగా సాలీనా ఐదు శాతం పెంచకతప్పదని విద్యుత్ ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.