ఆంధ్రప్రదేశ్‌

మళ్లీ మండలికి చక్రపాణి ముఖ్యమంత్రి సానుకూలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 6: రాష్ట్ర శాసన మండలి చైర్మన్ చక్రపాణి యాదవ్‌కు మరో అవకాశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన చక్రపాణి రాజకీయంగా అజాతశత్రువుగా పేరొందారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ఆధ్వర్యంలో శాసన మండలి ఏర్పాటైనప్పుడు పార్టీలో ఆయన సీనియారిటీని గౌరవిస్తూ గవర్నర్ కోటాలో శాసన మండలికి ఎంపిక చేసి ఆ తరువాత మండలి చైర్మన్‌గా నియమించారు. మొదటి సభలో నాలుగేళ్లు పదవిలో కొనసాగిన ఆయన రెండవ దఫా రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసన మండలికి ఎంపికై చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే రానున్న మార్చితో ఆయన పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆయన ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి సహకారంతో కర్నూలులో చంద్రబాబును కలిసి తనకు మరోమారు అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. మార్చివరకూ గడువు ఉన్నందున ఆలోచించి నిర్ణయిస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. చక్రపాణిని శాసనమండలికి పంపడానికి జిల్లాలోని టిడిపి నేతలెవరూ వ్యతిరేకించలేదని, దాంతో ఆయనకే అవకాశం కల్పిస్తారని టిడిపి నేతలు పేర్కొంటున్నారు. చక్రపాణి సాంకేతికంగా కాంగ్రెస్ వాది అయినా రాజకీయంగా నాయకులందరినీ గౌరవిస్తారని, శాసన మండలిలో కూడా అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ విమర్శలకు దూరంగా ఉన్నారని గుర్తుచేస్తున్నారు.