ఆంధ్రప్రదేశ్‌

డీజిల్ ధర పెంపుతో ఆర్టీసీపై పెనుభారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 6: ‘మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా దశాబ్దకాలం పైగా అంతులేని నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఎపిఎస్‌ఆర్టీసీకి పెరుగుతున్న డీజిల్ ధరలు ఆశనిపాతంగా మారుతున్నాయి. ఇటీవలి కాలంలో చీటికిమాటికి డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఎపిఎస్ ఆర్టీసీ ఇప్పటికే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలపైగా నష్టాలతో సతమతమవుతోంది. అయితే ఆర్టీసీ ఎండి నండూరి సాంబశివరావు తనకున్న తెలివితేటలు, సామర్థ్యంతో గత ఏడాది కాలంగా నష్టాలు పెరగకుండా సాధ్యమైనంత తగ్గించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ప్రయాణీకుల ఆదరణ పెరిగేలా ఆర్టీసీ బస్‌స్టేషన్‌లను, ఎయిర్‌పోర్టుల తరహాలో తీర్చిదిద్దటం, బస్సులను పరిశుభ్రంగా ఉంచడం, వెలుగు బస్సులను కూడా సరుకుల రవాణాకు వినియోగిస్తుండటం వంటి చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో 2100 అద్దె బస్సులతో సహా మొత్తం 12 వేల బస్సుల కోసం రోజూ 7 లల 70 వేల లీటర్ల డీజిల్‌ను వినియోగించాల్సి వస్తోంది. నిన్నటివరకు డీజిల్ లీటర్ ధర 61.86 పైసలు ఉండగా ఆదివారం నుంచి 63 రూపాయలకు చేరింది. అంటే రూ.1.14 పైసలు పెరిగింది. ఈ ప్రకారం ఆర్టీసీ వినియోగించే డీజిల్‌పై రోజుకు 8 లక్షల 77 వేల 800 రూపాయలు నెలకు రెండు కోట్ల 70 లక్షలు, ఇలా సంవత్సరానికి రూ.33 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతోంది. గత రెండు మాసాల్లోనే ఐదుసార్లు డీజిల్ ధర పెరగటం వల్ల పై విధంగా సాలీనా 150 కోట్లపైన భారం పడినట్లయింది. ఇక ఈ రెండు నెలలు పెట్రోలుపై దాదాపు రూ.8 వరకు పెరిగింది.