ఆంధ్రప్రదేశ్‌

ఏఇఇ హాల్‌టికెట్లలో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, నవంబర్ 6 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎపిపిఎస్‌సి) ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్(ఏఇఇ) ఉద్యోగాల నియామకానికి ఆదివారం నిర్వహించిన పరీక్షలో ఒకింత గందరగోళం ఏర్పడింది. అనంతపురం నగరంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఒకే హాల్‌టికెట్ నెంబర్ ఇద్దరికి చొప్పున కేటాయించినట్లు తెలియడంతో 18 మంది అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె హుటాహుటిన పరీక్ష కేంద్రానికి చేరుకుని, ఏపిపిఎస్‌సి ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఒకే నెంబర్ హాల్‌టికెట్ ఉన్న ఇద్దరిలో ఒకరికి ఒరిజినల్ నెంబర్, మరొకరికి అదే నెంబర్‌కు ఏను చేర్చి పరీక్ష రాయించారు. దీంతో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇదిలా ఉండగా హాల్‌టికెట్‌ల నెంబర్ కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చిత్రం.. అనంతపురంలోని శ్రీచైతన్య కళాశాలలో ప్రత్యేకంగా
కేటాయించిన నెంబర్‌పై పరీక్ష రాస్తున్న అభ్యర్థులు