ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో మావోల కదలికల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, నవంబర్ 6 : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సవ్యంగా ఉందని, మావోయిస్టుల కదలికలు లేవని, ఎన్‌కౌంటర్ జరిగింది ఒడిస్సా రాష్ట్రంలోనేనని హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. పోలీసులకు వారానికి ఒక రోజు సెలవు దినం ప్రకటిస్తున్నామని, అయితే కొత్త నియామకాలు పూర్తి చేసిన అనంతరం వారికి ఈ వెసులుబాటు కల్పిస్తామన్నారు. మంత్రి చినరాజప్ప ఆదివారం నంద్యాల పట్టణంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో భూ కబ్జాలు తగ్గిపోయాయని, ఇసుక మాఫియా, ఎర్రచందనం అక్రమ రవాణాను కట్టుదిట్టంగా అడ్డుకున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి మూడు నెలలకు ఒకసారి శాంతి భద్రతలపై సమీక్షిస్తూ పరిస్థితులను చక్కదిద్దుతున్నారన్నారు. పోలీసు శాఖలో కిందిస్థాయి అధికారి ఎస్‌ఐ నుంచి ఉన్నతాధికారుల వరకూ పని చేయడం వల్లనే నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ముఖ్యంగా మోసపూరిత స్కీంలతో అమాయకులను బుట్టలో వేసుకుంటున్న సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని, అలాంటి సంస్థల కదలికలపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. జిల్లాలో కేశవరెడ్డి విద్యాసంస్థల్లో జరిగిన కేసులపై విచారణ జరుగుతుందని, విచారణ కోసం హైదరాబాద్ వెళ్లిన కేశవరెడ్డి అక్కడ ఏమి చేశాడన్న విషయంపై దర్యాప్తు జరిపిస్తున్నామన్నారు. కేశవరెడ్డి డిపాజిట్‌ల రూపంలో సేకరించిన సొమ్మును ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు తిరిగి చెల్లిస్తామన్నారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న హోం శాఖ మంత్రి చినరాజప్ప