తెలంగాణ

సమస్యలకు చట్టాలే పరిష్కారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28 : వాతావరణంలో మార్పులు వస్తున్నాయని, ఈ అంశంలో ఎలాంటి చట్టాలు చేసినా ప్రయోజనం ఉండదని, ప్రజల్లో మార్పు రావలసిన అవసరం ఉందని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో డాట్స్ (డ్రాఫ్ట్ కానె్సప్ట్‌నోట్ ఫరి ది ఫార్ములేషన్ ఆఫ్ ఏ స్టేట్ క్లైమేట్ చేంజ్ పాలసీ) పై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, వాతావరణాన్ని చల్లగా ఉంచేందుకు చెట్లపెంపకం పెద్దఎత్తున చేపట్టాల్సి ఉందన్నారు. జాతీయ అంతర్జాతీయ సంస్థల సహకారంతో నిధులను సమీకరించుకుని చెట్లపెంపకం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్, మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. 2016 జూన్‌లోగా హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, తాత్కాలిక సచివాలయంలో బ్లాకుల కేటాయింపు తదితర అంశాలపై మున్సిపల్ మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ సోమవారం ఇక్కడ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించారు. ఈ వారంలో మరో పర్యాయం ఇంకో సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

రెసిడెన్షియల్ స్కూళ్లుగా హాస్టళ్లు
హైదరాబాద్, మార్చి 28: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మారుస్తామని సంక్షేమ శాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. సోమవారం శాసనసభలో మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం అనే రెండు కీలక లక్ష్యాలతో పనిచేస్తోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు కేటాయింపులు అనేక రెట్లు పెంచామని అన్నారు. అన్ని హాస్టళ్లలో బయోమెట్రిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి, అటెండెన్స్, హాస్టళ్ల వ్యయం పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. కాగా, మరో మంత్రి సుజాత మాట్లాడుతూ మహిళలు కోటీశ్వర్లు కావాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని చెప్పారు. మహిళలను లక్షాధికారులను చేస్తామని చెప్పిన కాంగ్రెస్ వారిని రోడ్లమీద పడేసిందని ఆరోపించారు.

తగ్గిన రైతుల ఆత్మహత్యలు: మంత్రి ప్రత్తిపాటి
హైదరాబాద్, మార్చి 28: ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలతో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రం ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సోమవారం నాడు శాసనసభలో వ్యవసాయ శాఖ బడ్జెట్‌పై జరిగిన చర్చలో పలువురు శాసనసభ్యులు మాట్లాడిన అనంతరం మంత్రి సమాధానం ఇస్తూ ప్రభుత్వ విధానాలను వివరించారు. రాష్ట్రంలో విత్తన బ్యాంకు ఏర్పాటు చేస్తామని, కరవు ఎదుర్కొనేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. పది మార్కెట్లలో ఇ-ప్లాట్‌ఫారాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పప్పు్ధన్యాల రేట్లు నిలకడగా ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. రైతులకు ఆంధ్ర ప్రదేశ్ మాదిరి పెద్ద ఎత్తున రుణ మాఫీ చేసిన రాష్ట్రం మరొకటి లేదని అన్నారు. మార్కెట్‌తో అనుసంథానం సాధించేందుకు 10 లక్షల మంది రైతులతో నెట్‌వర్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు.