ఆంధ్రప్రదేశ్‌

బాబు సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: తుని కాపు గర్జనలో చోటుచేసుకున్న విధ్వంసం, ముద్రగడ ఆమరణ నిరాహార దీక్ష తదితర అంశాలపై సిఎం చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారు. అతి సున్నితమైన అంశంలో ప్రభుత్వం అభాసుపాలయ్యే వరకూ రావడం వెనుక తూర్పుగోదావరి జిల్లా కాపు సామాజిక వర్గం వైఫల్యమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లో పాల్గొనేందుకు రెండు రోజుల కిందటే నగరానికి వచ్చిన సిఎం పార్టీ ముఖ్య నేతలతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు దిగడంతో ఒక్కసారిగా పరిస్థితుల్లో వచ్చిన మార్పులపై ఆయన సన్నిహిత మంత్రులు, ఇతర పార్టీ నేతలతో ఎడతెరిపి లేకుండా చర్చిస్తున్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని కాపు నేతలతో తరచూ మాట్లాడుతూ పరిస్థితులను చక్కదిద్దే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పార్టీకి చెందిన కాపు నాయకులను సైతం ఆయన విశాఖ పిలిపించుకుని చర్చిస్తున్నారు. తూర్పుకు చెందిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, మరికొంతమందితో శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో చర్చించారు. ముద్రగడతో జరిపిన సమావేశంలో తాను చర్చించిన అంశాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి బొడ్డు వివరించారు. హడావుడిగా కాకుండా కొంత ఆలోచించి నిర్ణయం తీసుకుందామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. ముద్రగడ ఉద్యమం ఇంత వరకూ రావడం వెనుక పార్టీ నాయకుల వైఫల్యాన్ని సిఎం చంద్రబాబు ఎత్తిచూపినట్టు సమాచారం. మీరు సక్రమంగా స్పందించి ఉంటే ముద్రగడకు ఈ మైలేజి వచ్చి ఉండేది కాదని, ఒక విధంగా చెప్పాలంటే అది మీచేతగాని తనంగా భావించాల్సి ఉంటుందంటూ ముఖం మీదే చెప్పినట్టు సమాచారం. అనంతరం కాపుల డిమాండ్లపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘంలో సభ్యులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావులతో మరోసారి సమావేశమై చర్చించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ ఏర్పాటు, కాపులను బిసిల్లో చేర్చే విషయంలో జస్టిస్ మంజునాథ కమిషన్ ఏర్పాటు తదితర అంశాలను ప్రచారం చేయలేకపోతున్నామని, ఇది నిజంగా పార్టీ వైఫల్యమేనని పార్టీ నాయకుల వద్ద సిఎం చంద్రబాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబును పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, ఎంపి అవంతి శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చెలమలశెట్టి రామానుజ, ఇతర పార్టీ నాయకులు కలిశారు.