ఆంధ్రప్రదేశ్‌

సంక్షేమ ఫలాలు ప్రజలకు చేర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 7: సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన సహాయార్థులు, సందర్శకులు, కృతజ్ఞతలు తెలుపుకునేందుకు వచ్చిన ఉద్యోగులతో సోమవారం ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం కోలాహలంగా మారింది. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన నూతక్కి వేణుగోపాల్‌కు గుండె శస్తచ్రికిత్స కోసం ఆర్థిక సాయాన్ని చంద్రబాబు అందజేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చి తమ సమస్యలు చెప్పుకున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి ఇతోధికంగా సాయం అందించారు. న్యాయ సహాయం కోరి వచ్చిన వారికోసం ప్రత్యేకంగా ఒక న్యాయవాదిని నియమించాలని అధికారులకు ఆదేశించారు. దశాబ్దకాలంగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినందుకు రెవెన్యూ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తరువాత వెలుగు ఉద్యోగులు తమకు 35 శాతం ఫిట్మెంట్ ప్రకటించినందుకు హర్షం ప్రకటిస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం శాయశక్తులా కృషి చేస్తానని ఈసందర్భంగా చంద్రబాబు నాయుడు అన్నారు. రెవెన్యూ, వెలుగు ఉద్యోగులు మరింత సమర్థంగా పనిచేసి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమ ఫలాలు సక్రమంగా, సకాలంలో ప్రజలకు అందేలా చూడాలని ఆయన సూచించారు.