ఆంధ్రప్రదేశ్‌

ఇది మరో చరిత్ర ( నోట్ల రద్దుపై సిఎం చంద్రబాబు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: దేశంలో చలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, పారదర్శకత పెరుగుతుందన్నారు. నల్లధనాన్ని నియంత్రించేందుకు వీలవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్య్రానంతరం దేశంలో తీసుకున్న చారిత్రక నిర్ణయంగా మిగిలిపోతుందని అభివర్ణించారు. పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయాలని తాను రాసిన లేఖపై ప్రధాని స్పందించడంపై తనకు సంతోషంగా ఉందని తెలిపారు. ఇదే తరుణంలో రానున్న కాలంలో ఆర్థిక సంస్కరణలు కూడా ప్రధాని చేపడతారన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. అంతకుముందు సిఎం చంద్రబాబు నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు పనగరియాతో భేటీ అయ్యారు. దేశంలో చలామణిలో ఉన్న 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేయాలని కోరారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల అవినీతికి చాలా వరకూ అడ్డుకట్టవేయచ్చన్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లాలో నగదు రహితంగా కొన్ని లావాదేవీలను ప్రయోగాత్మంగా నిర్వహించామని వివరించారు. ఎన్నికల్లో పెద్ద కరెన్సీ నోట్లను ఓటర్లకు పంచేందుకు వీలుగా ఉంటుందని, దీనివల్ల రాజకీయాల్లో అవినీతి పెరిగేందుకు కారణమవుతోందన్నారు. దేశంలో అవినీతి, నల్లధనం పెద్ద సమస్యగా మారిందని తెలిపారు. ఇప్పటికే తాను ప్రధానికి లేఖ రాశానని, నీతి ఆయోగ్ కూడా ఈ మేరకు సిఫారసు చేయాలన్నారు. దీనిపై పనగరియా స్పందిస్తూ దీనిపై ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకోవాలని, తానేమీ చేయలేనన్నారు. కానీ ఆర్థికవేత్తగా అభిప్రాయం చెప్పగలనన్నారు. అమెరికాలో కూడా పెద్ద కరెన్సీ నోట్ల రద్దు గురించి ఐఎంఎఫ్‌కు చెందిన ఒక అధికారి దీనిపై చర్చ ప్రారంభించారని గుర్తు చేశారు.